UA-35385725-1 UA-35385725-1

ఉపాద్యాయులు నిబద్ధతతో పని చేసి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

ఉపాద్యాయులు నిబద్ధతతో పని చేసి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

మంత్రి జూపల్లి కృష్ణారావు

న్యూస్‌తెలుగు/వనపర్తి : సమాజ పరివర్తనలో విధ్య అగ్రభాగాన ఉంటుందని అలాంటి విద్యను బోధించే ఉపాద్యాయులు నిబద్ధతతో పని చేసి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్బోధించారు. డా. సర్వేపల్లి రాధా కృష్ణ జన్మ దినం అయిన సెప్టెంబర్ 5 గురువారం రోజు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్వే పల్లి రాధ కృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి హోదా లో పని చేశారని వారి పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలుపుతూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజ పురోభివృద్ధికి పాటు పడే విధంగా ఉత్తమ వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుకుంటున్నారని అందులో కేవలం 22 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యాదిస్తున్నారని మిగిలిన వారంతా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల రూపాయలు వసూలు చేసి అరకొర చదువులు చెబుతుంటే .. ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇటీవలే ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించి బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. తనకు వచ్చే 10 కోట్ల బడ్జెట్ తో పాటు సి.ఎస్.ఆర్ ఫండ్ సైతం విద్య, వైద్యానికే ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జి. చిన్నారెడ్డి , జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, మోటివేటర్ భాస్కర్ గుప్త, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఉపాద్యాయులు నిబద్ధతతో పని చేసి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1