సామ్‌సంగ్ బెస్పోక్ ఏఐ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ సిరీస్ విడుదల
గురుగ్రామ్: భారతదేశంలోని ప్రముఖ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ తాజాగా భారతదేశంలో తమ కొత్త బెస్పోక్ ఏఐ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ సిరీస్‌ను ఆవిష్కరించింది. బెస్పోక్ డిజైన్, స్మార్ట్ థింగ్స్ ఏఐ ఎనర్జీ మోడ్, స్మార్ట్ థింగ్స్ హోమ్ కేర్, స్మార్ట్ ఫార్వర్డ్, కన్వర్టిబుల్ 5-ఇన్ 1, ట్విన్ కూలింగ్ ప్లస్, యాక్టివ్ ఫ్రెష్ ఫిల్టర్G వంటి అధునాతన ఏఐ ఫీచర్లతో, ఈ కొత్త శ్రేణి భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. సామ్‌సంగ్ బెస్పోక్ ఏఐ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ సిరీస్ బ్లాక్ గ్లాస్, బ్లాక్ మ్యాట్, లక్స్ బ్లాక్, ఎలిగెంట్ ఐనాక్స్, రిఫైన్డ్ ఐనాక్స్ వంటి అవకాశాలతో గ్లాస్, స్టీల్ ఫినిష్‌లో అందుబాటులో ఉంటుంది. సామ్‌సంగ్ కొత్త బెస్పోక్ ఏఐ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ సిరీస్ మూడు సామర్థ్యాలలో లభిస్తుంది-అవి 396లీటర్, 419 లీటర్, 465 లీటర్.
బంధన్ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్
ముంబయి: బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్‌ను విడుదల చేసినట్లు వెల్లడిరచింది. ఈ కొత్త ఫండ్‌ను సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచామని, సెప్టెంబరు 13వ తేదీతో ముగియనుందని తెలిపింది. తిరిగి నిరంతర క్రయవిక్రయాల కోసం సెప్టెంబరు 20 నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడిరచింది. ఇందులోని కొంత మొత్తాన్ని సెక్యూరిటీస్‌ల్లోనూ పెట్టుబడిగా పెట్టనున్నట్లు పేర్కొంది. (Story : సామ్‌సంగ్ బెస్పోక్ ఏఐ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ సిరీస్ విడుదల)