UA-35385725-1 UA-35385725-1

రియ‌ల్ స్టోరీః బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ‌లే బెజ‌వాడ‌కు శాప‌మా?

రియ‌ల్ స్టోరీః బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ‌లే బెజ‌వాడ‌కు శాప‌మా?

బుడమేరు కాల్వ‌ను మింగిన ఆక్రమణలు
భారీ భవంతుల నిర్మాణం
హైడ్రా తరహా చర్యలే సరి..
బుల్డోజర్లతో నేలమట్టమే శరణ్యం

న్యూస్‌ తెలుగు/అమరావతి: మితిమిరీన ఆక్రమణలు బుడమేరు కొంప ముంచాయి. చివరకు బుడమేరు పరివాహక ప్రజల జీవితాలు కొల్లేరుగా మారాయి. సహజ సిద్దంగా ప్రవహించే బుడమేరుకుకు అడుగడుగునా ఆక్రమణలు అడ్డుతగలడంతోనే ఈ ఘోర విపత్తుకు కారణమైంది. భారీ వర్షాలు, వరదల ముంపుతో బుడమేరు ప్రాంతంలోని నివాసాలన్నీ నీటమునిగాయి. విజయవాడ నగర పరిసర ప్రాంతాలకు బుడమేరు చావు దెబ్బ మిగిల్చింది. ఉమ్మడి కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు నుంచి బుడమేరు ప్రవహిస్తుంది. అది సహజ సిద్దంగా కొండల నుంచి వచ్చే నీటి ప్రవాహం, కిందన ఉన్న నీరు తోడై అక్కడి నుంచి పారుతుంది. ఆ తర్వాత మైలవరం నియోజవకర్గంలోని వెలగలేరు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి కృష్ణాజిల్లా నందిగామ మండలం నుంచి కొల్లేరులో కలుస్తుంది. నిత్యం తన పనితాను చేసుకుంటూ ఉండే బుడమేరకు..ఆక్రమణల బెడద రావడంతోనే ఒక్కసారిగా కన్నెర్రజేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ నగరాన్ని, పరిసర గ్రామాలను ముంచెత్తింది. దీని ప్రభావంతో ఆరు లక్షల మంది ప్రజలు ముంపు భారిన పడ్డారు. అందులో అధికశాతం మంది నిరాశ్రయులయ్యారు.

బుడమేరులో భారీ ఆక్రమణలు

బుడమేరు ముంపునకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చూస్తే ఆక్రమణలే. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రవహించే బుడమేరు గర్భలోకి సైతం భారీ ఇళ్లను నిర్మించారు. గడ్ల వెంబడి ఇళ్లనూ నిర్మించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో పేదలతోపాటు ధనవంతులూ ఉన్నారు. ఆయా ప్రభుత్వాలు మారినప్పడల్లా రాజకీయ, అర్థబలంతో బుడమేరును ఆక్రమించారు. ఒక్క సింగ్‌నగర్‌ ఫ్లైవోర్‌ నుంచి చూస్తే, సాధారణ పరిస్థితుల్లో బుడమేరు కన్పించదు. దాని నిండా పెద్ద పెద్ద కట్టాలే కన్పిస్తాయి. ఆ కట్టడాల్లో బుడమేరు ప్రవాహం రాకుండా చుట్టూ ప్రహరీ గోడలను భద్రగా నిర్మించారు. దీంతోనే అక్కడ ఇళ్ల నిర్మాణానికి ముంపు ఉందని ఆ ప్రవహరీ గోడల ద్వారానే తెలియజేస్తున్నాయి. అధికార ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల అండదండలతో అనాదీగా ఇవి వెలుస్తున్నాయి. మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఈ అక్రమ నిర్మాణాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. బుడమేరు మధ్యన, గట్లపైన వేలాది ఇళ్లు నిర్మించుకోవడం, వారందరికీ స్థానికంగా ఓట్లు రావడం, కరెంటు బిల్లులు, ఇతరత్రా హక్కులు కలిగి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆక్రమణలు తొలగించాలంటే రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తారు.ఎవరైనా సామాన్యుడు చిన్నపాటి ఇంటి నిర్మాణం ప్రభుత్వ భూములో నిర్మిస్తే, తక్షణమే రెవెన్యూ అధికారులు వెళ్లి దాడులు చేసే పరిస్థితి ఉంది. వెంటనే ఆ కట్టడాలను కూల్చివేస్తారు. అదే బుడమేరు అక్రమణలు తొలగింపులో అధికారులు అంతదూకుడుగా వ్యవహరించడం లేదు రాజకీయ నేతలకు ఎన్నికల సమయంలో ఓట్లు కావాలి. దానిని దృష్టిలో ఉంచుకుని ఆక్రమణల చెంతకు పోవడం లేదు. ఏదైనా బలవంతంగా తొలగించాల్సి వస్తే, తమ పార్టీ వారిని విడచి ఇతర సామాన్యుల ఆక్రమణలు తొలగించాలనే ఆదేశాలు ఇవ్వడంతో బుడమేరుకు ఆక్రమణల తొలగింపు పెద్ద సమస్యగా మారింది.
రెండో కారణంగా చూస్తే, బుడమేరు పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేయకపోవడం. బుడమేరు కాల్వగట్లను ఎప్పటికప్పుడూ ఆధునీకరించి, గండ్లు పడకుండా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించ‌డం ఇక్క‌డ ప‌రిపాటి. బుడమేరులోని గుర్రపుడెక్కను ఎప్పటికప్పుడూ తొలగించకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్నపాటి వర్షానికి బుడమేరు పొంగే పరిస్థితి వచ్చింది. ఈ తప్పిదాలను ప్రభుత్వాలు సరిదిద్దుకుని, బుడమేరు ప్రక్షాళనకు, ఆక్రమణలను తొలగిస్తే, భవిష్యత్‌లో ముంపు ప్రమాదం ఉండదు.

హైడ్రా తరహాగా ఆక్రమణలు తొలగించాలి

హైదరాబాద్‌లోని హైడ్రా తరహాగా బుడమేరు ఆక్రమణలను తొలగించాలని విజయవాడ నగర ప్రజలు కోరుతున్నారు. బుడమేరు ప్రవహించే ప్రాంతం నుంచి అదే కలిసే కొల్లేరు వరకు కరకట్టలపైన, లోపల ఉన్న ఆక్రణలను ముందుగా గుర్తించాలి. భారీ అంతస్తులతో భవనాలు నిర్మించిన వాటిని అప్పటికప్పుడే బుల్డేజర్లతో నేలమట్టం చేయాలి. ఎక్కడా వెనక్కి తగ్గకుడా కూల్చుకుంటూ పోవాలి. ఇఅప్పుడే బుడమేరుకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది.తమ పార్టీ నేతలనో, లేక నచ్చినవారినో ప్రభుత్వం చూడకుండా ఏకధాటిగా ఆక్రమణలు తొలగిస్తేనే బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇందుకోసం హైడ్రా తరహాగా ఒక కమిటీ ఏర్పాటు చేసి, అందులో రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌, పోలీసుశాఖలను బాధ్యులుగా చేయాలి. అప్పుడే బుడమేరుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లేకుంటే పదేపదే విజయవాడ ముంపు బారిన పడే ప్రమాదముంది. (Story: రియ‌ల్ స్టోరీః బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ‌లే బెజ‌వాడ‌కు శాప‌మా?)

See Also:

ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాతృత్వం!

చ‌రిత్ర ఎన్న‌డూ చూడ‌ని విప‌త్తు!

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1