UA-35385725-1 UA-35385725-1

రషీద్ హత్యకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు

రషీద్ హత్యకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు

న్యూస్‌తెలుగు/వినుకొండ : రషీద్ హత్యకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఇతర దోషులను కూడా అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడాలని, కుట్రదారులైన మరో ఇద్దరి పేర్లను ఏ1, ఏ2 లుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రషీద్ కుటుంబ సభ్యులు…..మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఈ కేసు విచారణ సమయంలో పాల్గొంటారని, గురువారం రషీద్ హత్యకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని ఎం. ఎన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జులై 17న తొలి ఏకాదశి నాడు వినుకొండ నడిబొడ్డున రషీద్ ను అత్యంత పాశవికంగా నరికి చంపారని, హత్య చేసిన మరియు చేయించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని…హత్యకు సంబందించిన వీడియోను చూసి నివ్వెర పోయిన ప్రతి ఒక్కరి ఆవేదన అని తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికి వారు 4, 5 రిమాండ్ రిపోర్ట్లు వేశారని… దీనికి సంబంధించి దాదాపు 20 మందికి పైగా ఈ హత్యలో పాల్గొన్నారని… ఒకరు హత్య చేస్తుంటే మిగిలిన వారందరూ పహారా కాశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి 14 మందిని మాత్రమే అరెస్టు చేశారని… నేటికీ హత్య జరిగి 50 రోజులైనా కూడా మిగతా వారిని ఇప్పటికి కూడా అరెస్టు చేయలేదని అన్నారు. అంతేకాక ఈ హత్య చేయించిన మరియు చేసిన వారికి సహకరించిన వారి పేర్లను రషీద్ కుటుంబ సభ్యులు రిపోర్ట్ లో పేర్కొన్నారని…. అయినా పోలీసులు వారి పేర్లను ఎఫ్.ఐ.ఆర్ లో ముద్దాయిల జాబితాలో చేర్చలేదని. కానీ తరువాత రిమాండ్ రిపోర్ట్ లో 61(2) సెక్షన్ ప్రకారం కుట్ర జరిగిందని వేశారు. కానీ… ఇప్పటి వరకు కుట్రదారులు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదని… వారిపై పోలీస్ వారు ఎటువంటి చర్యలు తీసుకోనందున, తాము తెలిపిన పేర్లను కూడా చేర్చాలని నేడు కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి, పోలీస్ వారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఇంకా మిగిలిన ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరు పరచి, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేసి రషీద్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రషీద్ తల్లి మాట్లాడుతూ పోలీస్ వారు ఇప్పటివరకు తాము చెప్పిన పేర్లను చేర్చలేదని…. తాము చెప్పిన మొబైల్ లను తనిఖీ చేయలేదని… రషీద్ హత్యకు సంబంధించి తమకు న్యాయం జరగట్లేదని అన్నారు. ఏ తప్పు చేయకున్న తన బిడ్డను ఎంతో పాశవికంగా నరికి చంపారని… హత్య చేయించిన వారు కళ్ళ ముందు తిరుగుతున్న వారిని అరెస్ట్ చెయ్యట్లేదని వాపోయారు. హత్య చేసిన అతను, నా బిడ్డ ఒకే పార్టీ వారు ఆరోపణలు చేస్తున్నారుగా…. ఈ హత్య చేయించిన వారికి శిక్ష పడేలా చేయిస్తానని… ప్రస్తుత ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ హత్యకు కుట్ర పన్నిన, హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేసి తమకు న్యాయం చేయాలని రషీద్ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. (Story : రషీద్ హత్యకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1