ప్రారంభమైన అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ లపుట్టినరోజు సందర్భంగా, ధర్మవరం పట్టణంలోని ఆర్డిటి గ్రౌండ్లో అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో, మంత్రి సత్య కుమార్ యాదవ్ వారి కార్యాలయ సిబ్బంది హరీష్, మల్లికార్జున పాల్గొని క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి గొట్ట్లూరు, బడన్నపల్లి మధ్య తొలి క్రికెట్ మ్యాచ్‌కు టాస్ వేసి, టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ప్రధానమైన అద్భుతమైన క్రీడా కార్యక్రమం, స్థానిక క్రీడా ప్రేమికులకు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారని తెలిపారు. ప్రస్తుతం, ఈ టోర్నమెంట్ భాగస్వామ్యమై ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. అనంతరం 6 జట్లకు మూడు మ్యాచ్లు జరగా గొట్ట్లూరు కు బడాన్న పల్లి జరిగిన మ్యాచ్లో బడన్నపల్లి మీద గొట్ట్లూరు ఐదు పరుగుల తేడాతో గెలిచింది అని తెలిపారు. మేడాపురం కు శివంపల్లికి జరిగిన మ్యాచ్లో శివంపల్లి మీద మేడాపురం 22 పరుగుల తేడాతో విజేతలయ్యారని తెలిపారు. బసంపల్లెకు కొత్తచెరువు జరిగిన మ్యాచుల్లో కొత్తచెరువు మీద బసంపల్లి 9 పరుగుల తేడాతో గెలిచిందన్నారు. అలాగే జరిగిన మూడు మ్యాచ్లలో గుట్ట్లూరు వెంకటేష్, మేడాపురం సమర, బసంపల్లి సోము ముగ్గురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, అంబటి సతీష్, సాకే ఓబులేష్, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రారంభమైన అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం)