నేడు క్రీ శే.సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి
న్యూస్ తెలుగు /ములుగు :
క్రీ.శే సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తేదీ:05-09-2024 రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుందని,జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ సేవలు అందించినటువంటి ఉపాధ్యాయులకు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించబడుతుందని వారు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఉపాధ్యాయుల నుండి కమిటీ ఎంపిక చేసినటువంటి 15 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేయబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని అందరూ మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, అన్ని ఉపాధ్యాయ సంఘం జిల్లా బాధ్యులు హాజరు కావలసిందిగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కాబడినటువంటి ఉపాధ్యాయుల లిస్ట్ దీనివెంట జతపరచబడినది. (Story : నేడు క్రీ శే.సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి)