జాతీయ మెగా లోక్ అదాలకు సద్వినియోగం చేసుకోండి
సీనియర్ సివిల్ జడ్జ్, న్యాయ విజ్ఞాన సదస్సు చైర్మన్- ఏ. గీతా వాణి
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణములోని కోర్టులో ఈనెల 14వ తేదీ (రెండవ శనివారం) నాడు జాతీయ మెగా లోక్ అదాలకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ ఏ. గీతావాణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అదాలత్ కార్యక్రమమును ఏపీ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి ఆదేశాలు ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, న్యాయవాదులు, బ్యాంకు రుణం పెండింగ్ ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ లోక అదాలతో రాజీ కాదగ్గ సివిల్ క్రిమినల్ తో పాటు ఇతర కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. రాజీమార్గమే రాజమార్గమని తెలిపారు. పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు కూడా ఈ లోక్ అదాలతో విజయవంతం అయ్యేవిధంగా సహకరించాలని తెలిపారు. (Story : జాతీయ మెగా లోక్ అదాలకు సద్వినియోగం చేసుకోండి)