సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో లో పతకాలు
న్యూస్‌తెలుగు / విజయనగరం : సత్య డిగ్రీ, పీజీ కళాశాల లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి షేక్ నూరున్నిష ఆగస్టు 31న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, చిత్తూర్ జిల్లాలో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్ర ఉమెన్ చాంపియన్షిప్ లో , సీనియర్ రాష్ట్ర తైక్వాండో చాంపియన్షిప్ లోను 57 కేజీల విభాగంలో లో స్వర్ణ పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. ఈ పోటీలు ఖెలో ఇండియా తమిళనాడు లో ఈనెల 11 నుండి 14 వరకు సీనియర్ తైక్వాండో చాంపియన్షిప్, అక్టోబర్ 17 నుండి 20 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు. అలాగేడిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎస్. పల్లవి సెప్టెంబర్ నెలలో అనకాపల్లి లో జరిగిన 11 వ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలలో 71కేజీల విభాగంలో స్వర్ణ పతకం లభించింది. ఇదే పోటీలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఏ. యశస్వి 64కేజీల విభాగంలో రెండు రజిత పతకాలు, బి. నీరజ 45 కేజీల విభాగంలో ఒక స్వర్ణ పతకం సాధించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు జాతీయ అంతర్జీతీయ స్థాయి లో రాణించే విధంగా విద్యార్థులు కృషి చెయ్యాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్య వేణి, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి శూరపు నాయుడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ చల్లా రాము పాల్గొన్నారు. (Story : సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో లో పతకాలు)