టిటిడి చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు?
న్యూస్‌తెలుగు/తిరుపతి : టిటిడి చైర్మన్ గా సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ను నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో కాకలు తీరిన రాజకీయ యోధుడు గా సుబ్బారాయుడు కు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 24 ఆగష్టు 1959న సుబ్బారాయుడు జన్మించారు. నర్సాపురం వైఎన్ కళాశాల లో ఇంటర్ పూర్తి చేసారు.
1980 లో మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1981లో వివాహం జరిగింది.ఒక కుమారుడు, ఒక కుమార్తె. 1989, 1994, 1999, 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపల్లి సుబ్బా రాయుడు తెలుగు దేశం అభ్యర్థి గా ఘన విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా కొత్తపల్లి సుబ్బరాయుడు ఎన్నికయ్యారు. 1996 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నుంచి తెలుగు దేశం అభ్యర్థి గా ఎన్నికైనారు. రాష్ట్ర సమస్యలపై తొలి సారిగా తెలుగు లో లోక్ సభలో ప్రసంగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కు మూడు పర్యాయాలు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు గా పని చేసారు. అదేవిధంగా 2012 లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గా పని చేసారు.1995లో ఎన్టీఆర్ క్యాబినెట్ లో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా పని చేశారు. నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో విద్యుత్ శాఖా మంత్రి గా ఎంతో సమర్ధవంతంగా పని చేసారు.ఒక ఆటో డ్రైవర్ కు యలమంచిలి జడ్.పి.టి.సి.టికెట్ ఇచ్చి గెలిపించి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఘనత సుబ్బారాయుడుది. దశాబ్దకాలం జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ తో అనుబంధం
ఎన్టీఆర్ సంక్షేమ పథకాల స్ఫూర్తితో సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీలో 1982 లో కౌన్సిలర్ గా చేరారు. ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనకు ఎన్టీఆర్‌తో సన్నిహిత అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 1994లో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే 9వ మంత్రిగా సుబ్బరాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
చిరంజీవితో అనుబంధం
సుబ్బా రాయుడు చిరంజీవి రాజకీయాలు సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన రోజుల నుండి సన్నిహితంగా ఉన్నారు. సుబ్బా రాయుడు చిరంజీవికి అతని రాజకీయ ప్రవేశానికి మద్దతు ఇవ్వవలసి వచ్చింది. సుబ్బా రాయుడు తెలుగుదేశం పార్టీని వీడడానికి వారి సన్నిహిత సంబంధాలే ప్రధాన కారణం.
సి.ఎం.వైఎస్ఆర్ తో అనుబంధం
కొత్తపల్లి సుబ్బా రాయుడు ఎప్పుడూ వైఎస్‌ఆర్‌తో కలిసి పని చేయలేదు, అయితే వైఎస్‌ఆర్ కి సుబ్బారాయుడు అంటే ఎంతో ఇష్టం గా ఉండేది. అసెంబ్లీ లో సుబ్బారాయుడు వాగ్ధాటి పటిమకు ఆయన ఎంతో ముగ్ధుడయ్యేవారు. వైఎస్ ఎప్పుడూ సుబ్బా రాయుడికి మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో అతనికి మంచి పదవిని ఇస్తారని వైఎస్ కబురు చేస్తే ఆ ఆఫర్లను సుబ్బ రాయుడు సున్నితంగా తిరస్కరించి తెలుగుదేశం పార్టీలో ఉండిపోయారు. కాపు కార్పోరేషన్ చైర్మన్ గా పని చేసారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఈ ఏడాది ఫిబ్రవరి 28న జనసేన పార్టీ లో చేరారు. (story : టిటిడి చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు?)