తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
ఉద్యానవన పంటలపై రైతులు ఆసక్తి చూపాలి.. జిల్లా కలెక్టర్ టిఎస్.చేతన్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు వచ్చే విధంగా ఉద్యానవన పంటలపై రైతులు ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్ టిఎస్. చేతన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఉద్యానవన పంటలలో ఆదర్శంగా నిలిచిన రైతుల పంట పొలాలను సందర్శించడం జరిగింది.
ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని, నాగులూరు వద్ద రైతు వెంకటేశ్వర్ రెడ్డి మామిడి తోట అల్లనేరేడు తోట, మామిడి తోటల లో అంతర్ పంటలైన టమేటా, గోంగూర, మునగ, మిరప పంటలను కలెక్టర్ పరిశీలించారు, బత్తలపల్లి మండలంలోని దాదాసాహెబ్, హిదయ తుల్లా, చీని తోట పంటలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపి పిడి సుదర్శన్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు,
ఉద్యాన పంటలలో మంచి ఫలితాలు సాధించి మరింత ఆర్థిక అభివృద్ధి చెంది నలుగురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.
అంతర్ పంటలు సాగు చేస్తున ధర్మవరం మండలం గోట్లూరు పంచాయతీకి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పది ఎకరాల పొలంలో ఎంఐ డి హెచ్ పథకం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా అంతర్ పంటలు వేసి మామిడి, నేరేడు, టమేటా, మునగ పంటల సాగు చేయుచున్నానని తెలిపారు. బోరులో నీరు తక్కువగా ఉంది అందుకు నేను ఉద్యానవన పంట లపై ఆసక్తి చూపుతున్నానని కలెక్టర్ కి వివరించారు. అంతకుమునుపు వేరుశనగ ,కంది, పంటలు వేసి నష్టాలు చూడడం జరిగిందని తెలిపారు. మామిడి మొక్కల మధ్య దూరం ద్వారా టమాటా పంటను వేశానని, డ్రిప్ కంపెనీ, సబ్సిడీ వివరాలను జిల్లా అధికారుల నుండి తెలుసుకొని వారి ద్వారా మంచి పంటలు పండించుచున్నానని జిల్లా కలెక్టర్ కు రైతు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బత్తలపల్లి మండలంలోని దాదాసాహెబ్ ఛీ నీ పంటను కలెక్టర్ పరిశీలించారు . అనంతరం జిల్లా కలెక్టర్ రైతు తో మాట్లాడుతూ చీని పంటను ఎందుకు వేశావని అడగగా వేరుశనగ తో ఆదాయం తక్కువగా ఉన్నందున ఉద్యానవన అధికారుల సహకారంతో చీని పంటను సాగు చేయడం జరిగిందని అని తెలిపారు. నాకున్న మూడు ఎకరాలలో చీని పంటను వేయడం జరిగిందని. నాకున్న ఛీ నీ తోటలో సంవత్సరానికి 50వేల రూపాయలు ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా ఉద్యాన అధికారి, మోసంబి, మరియు సాత్ గుడి రకాల సాగులను తెలుసుకొని, మార్కెటు వివరాలను తెలుసుకొని, అనంతపురం మార్కెట్కు, బెంగళూరు మార్కెట్ కు ఛీ నీ పండ్లను పంపిణీ చేయుచున్నానని జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో, డివిజన్, మండల, ఉద్యానవన, మైక్రో ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు)