Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

0

వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): ధ‌ర్మ‌వ‌రం పట్టణంలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించే కమిటీల వారిచే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్వో నటరాజ్, ఫైర్ అధికారి రాజు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని, వినాయక ఉత్సవ విగ్రహ ఏర్పాట్లు తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి వివరించారు. అనంతరం డిఎస్పి, ఆర్డీవో మాట్లాడుతూ సింగిల్ విండో విధానముతో గణేష్ ఉత్సవాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, సులభతరం చేయడానికి ప్రత్యేక పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. గణేష్ ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారానే అనుమతులు పొందాలని వారు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వెబ్సైటును కూడా వారు తెలియజేశారు. ప్రత్యేక పోర్టల్ తో పాటు చాట్ బాట్ సేవలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్లో ఎలా అనుమతి పొందాలి అన్న విషయాన్ని వారు పూర్తిగా వివరించారు. మున్సిపల్ కార్యాలయం,విద్యుత్ కార్యాలయం, అగ్నిమాపక కార్యాలయం, పోలీస్ శాఖలతో తప్పనిసరిగా సమన్వయంతో అనుమతులు పొందాలని తెలిపారు. వినాయక విగ్రహాలను ప్రతిష్టించే రోజు నుంచి నిమజ్జనం చేసేంతవరకు తగిన జాగ్రత్తలు అనగా విద్యుత్ సరఫరాలో, ఎటువంటి లోటు పాటు లేకుండా తగిన జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. ప్రతి నిర్వాహకుడు తమ విగ్రహ నిమజ్జనం తేదీని తెలుపుతూ ఆరోజే తప్పనిసరిగా నిమజ్జనం చేయాలని వారు స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ మండపాల ఏర్పాటు ఊరేగింపులు నిమజ్జనులకు మీ సేవలో చలానా రుసుమును చెల్లించి, ఎన్ఓసి క్యూఆర్ కోడ్ను పొందాలని తెలిపారు. అనుమతులను క్యూ ఆర్ కోడ్ ఉత్సవాలను నిర్వహించే పందిరిలో తనిఖీలకు వచ్చే అధికారులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా నిర్వహించాలని తెలిపారు. వినాయక విగ్రహం ఏర్పాటు, స్థలము, చిరునామా, గణేష్ మండపం ఎత్తు వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. గణేష్ మండపాల వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక సౌండ్ ఉండరాదని, రాత్రిపూట గణేష్ మండపములు ముగ్గురు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని, టపాసులు గాని అగ్నికి కార్య కారణమయ్యే వస్తువులు ఉంచరాదని తెలిపారు. అదేవిధంగా మండపాల వద్ద వాహనాల పార్కింగ్ ఉన్నరాదని, నిబంధనలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్లు రాత్రి 10:00 నుండి ఉదయం 6 గంటల వరకు వినియోగించే రాదు అని వారు స్పష్టం చేశారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు నీటి బకెట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పట్టణ పోలీస్ స్టేషనులకు గాని 112 కు గాని డయల్ చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నటరాజ్, విద్యుత్ శాఖ అధికారులు, దాదాపు 600 మంది ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. (Story: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version