UA-35385725-1 UA-35385725-1

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,

 రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

చెరువులు, వాగుల పరిసర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి

ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్ట చర్యలు

అధికారులు ప్రతి చెరువులో నీటి నిల్వలు పర్యవేక్షించాలి

లోతట్టు ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి

అతి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రులు

న్యూస్ తెలుగు /ములుగు : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన పునరవాసా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి జిల్లా కలెక్టర్లతో అతి భారీ వర్షాలు దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పి శభరిష్ తొ కలసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులంతా అప్రమత్తతో, అందుబాటులో వుండాలని ఆదేశించారు.
పంచాయితి రాజ్ అధికారులు గ్రామ పరిధిలో పురాతన, శిథిల భవనాలు, గోడలు కూలే పరిస్థితులు ఉన్నట్లైతే, వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. చెరువులు, వివిధ ప్రాజేక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, చెరువులు,
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపిఓ లు భారీ వర్షాల నేపథ్యంలో హెడ్ క్వార్టర్ లో ఉండి సమన్వయంతో పనులు చేయాలనీ, జిల్లా లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
గ్రామాల్లోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవహం అధికమై నట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని, విద్యుత్ వైర్లు తెగి పడిపోయి నట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రజలను తరలించేందుకు సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు వీలుగా సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితి మెరుగు పడేవరకు చెరువుల, వాగుల వద్ద చేపలు పట్టడానికి, స్నానాలకు అనుమతించవద్దని అన్నారు.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109, ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్‌ రూమ్‌ సెల్ నెo. 6309842395. 08717-293246 ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లా లోని బోగత జలపాతం, లక్నవరo, రామప్ప సరస్సులు తదితర పర్యాటక
ప్రాంతాలను ముసివేసినట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ కె. సత్య పాల్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1