Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి చొరవతో వృద్ధుడికి మోకీలు మార్పిడి

మంత్రి చొరవతో వృద్ధుడికి మోకీలు మార్పిడి

0

మంత్రి చొరవతో వృద్ధుడికి మోకీలు మార్పిడి

సమస్య చెప్పిన కొన్ని రోజుల్లోనే స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను చూరగొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఒక వృద్ధునికి మోకీలు మార్పిడి చేయించి, అతని ఆరోగ్య సమస్యను పరిష్కరించారు. ఇందులో భాగంగానే
ధర్మవరం రూరల్ గొట్ట్లూరు గ్రామానికి చెందిన బాలకొండ వెంకటేష్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో సతమతమవుతూ ఉన్నాడు. గత నెలలో మంత్రి సత్య కుమార్ యాదవ్ తన సమస్యను తెలియజేశాడు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తిరుపతిలోని బర్డ్స్ ఆసుపత్రిలో సంబంధించిన వైద్య నిపుణులతో మాట్లాడి అతడికి ఆగస్టు 13వ తారీకున మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స నుండి తేరుకున్న ఆ వృద్ధుడు సోమవారం ధర్మవరంలోని మంత్రి కార్యాలయానికి వచ్చి మంత్రిగారి కార్యాలయ సిబ్బంది హరీష్, మల్లికార్జునలకు కృతజ్ఞతలు తెలియజేసాడు. ప్రజల సమస్యలను తెలిసిన వెంటనే పరిష్కరించే సత్య కుమార్ యాదవ్ లాంటి మంత్రి ధర్మవరానికి ఎమ్మెల్యేగా రావడం ఎంతో అదృష్టం అన్నాడు. గతంలో తాను మోకాళ్ల నొప్పులతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నానని, ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు చేసుకున్న ఆ సమస్య పరిష్కారం కాలేదన్నాడు. తన సమస్యని మంత్రి కు చెప్పిన వెంటనే ఆయన శస్త్ర చికిత్స చేయించడం తన జీవితంలో మరిచిపోలేనన్నాడు. మంత్రి చొరవతోనే తాను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తన సమస్యను పరిష్కరించినందుకు మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు. (Story : మంత్రి చొరవతో వృద్ధుడికి మోకీలు మార్పిడి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version