మర్రికుంట చెరువును పరిశీలించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ వర్షాలతో చెరువులు వాగులు వంకలు అలుగులు పారావి మళ్లీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి చెరువులు వాగులు వంకలు అలుగులు పారుతున్నాయి వనపర్తి పట్టణంలో 9వ వార్డులో మర్రికుంట చెరువు నిండుకుండల మారింది వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ ప్రభుత్వ అధికారులు చెరువులను పరిశీలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనపర్తి నియోజకవర్గం లో కూలిన ఇండ్లను లోతట్టు ప్రాంతంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కురుస్తున్న వర్షాలకు చిన్న పిల్లలను బయటకు రాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అన్నారు. వీధుల్లో ఉండే ఇనుప స్తంభాలను తాగకుండా చూసుకోవాలి నియోజకవర్గం లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. (Story :” మర్రికుంట చెరువును పరిశీలించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి)