ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలి
*అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంట్లో నుండి బయటికి రావొద్దు
*విద్యుత్ స్తంభాలకు మరియు విద్యుత్ తీగలకు తగు దూరం పాటించాలి
*అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు :
ములుగు జిల్లాలో గత రెండు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన కటాక్షపూర్ వాగు మరియు జలగలంచ పరివాహక ప్రాంతాలను పరిశీలించి, వరద ఉధృతి గురించి,తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, తెలుసుకుని అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి, వరద ఉధృతి ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భముగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, కావున జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గత సంవత్సరం వరదల వలన కటాక్షపూర్ మరియు జలగలంచ వాగులు పొంగి, జాతీయ రహదారి వరదల్లో కొట్టుకుపోయిందని,కావున రవాణా అంతరాయం కలిగి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు.కావున నేడు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని, ముందస్తుగా వాగుల యొక్క వరద ఉధృతిని పరిశీలించి, అధికారులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలందరూ అత్యవసర పరిస్థితి ఉంటేనే మాత్రమే బయటికి రావాలి అని, అలాగే విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ తీగలకు దూరం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)