బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ 14… కండీషన్స్ లిమిట్‌లెస్!
Bigg Boss Telugu 8 Contestants: ప్రతియేటా టీవీ ప్రేక్షకులను మరిపించి, మైమరిపిస్తున్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలైంది. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా స్టార్‌మా టీవీలో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా షురువైంది. గత ఏడాది విజయవంతంగా ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్‌తో కొనసాగగా, ఈసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ నాగార్జున (Nagarjuna Akkineni) సందడి చేశారు.
ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్ (bigg boss 8 telugu contestants list)ను బడ్డీ కాన్సెప్ట్‌తో అంటే ఇద్దరి చొప్పున కలిపి జంటగా బిగ్‌బాస్ ఇంటిలోకి పంపారు.
మొత్తం 14మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్‌బాస్ (Bigg Boss Telugu) హౌస్‌లోకి వెళ్లారు. అలాగే బిగ్‌బాస్ ఈ సీజన్‌కు సంబంధించి మూడు కండీషన్స్ పెట్టాడు. ఈ సీజన్‌లో హౌస్‌కు కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌కు (bigg boss 8 contestants) రేషన్ ఇవ్వరు. వాళ్లే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్‌మనీ జీరో అంటూ రివీల్ చేశాడు. అంటే, హౌస్‌మేట్స్ ఆటను బట్టి, ప్రైజ్‌మనీ లిమిట్‌లెస్‌గా మారుతుంది.
తొలి కంటెస్టెంట్ యష్మి
Yashmi: నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను. ఆకలేస్తే కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా, అబద్ధం చెప్పినా కోపం వస్తుంది..అంటూ సీజన్-8లో తొలిసారి అడుగు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి (Yashmi). బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హౌస్‌లోకి వెళ్లేముందు యష్మి మాట్లాడుతూ..తనకు ప్రస్తుతం ఏ బాయ్‌ఫ్రెండ్ లేడని రివీల్ చేసింది. ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్ స్వింగ్స్ భరించలేకనే అతడిని పంపేశా. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదట రిలేషన్‌షిప్, లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోనని కూడా తేల్చిచెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో నాకెలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తానని చెప్పుకొచ్చిన యష్మి తొలి రో్జునే ఆకట్టుకుంది.
2వ కంటెస్టెంట్ నిఖిల్
Nikhil: ఈ బిగ్‌బాస్ సీజన్‌లో రెండవ కంటెస్టెంట్‌గా నిఖిల్ అడుగుపెట్టాడు. కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన నిఖిల్ డ్యాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు. అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయానని, సినిమాల్లో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పాడు. బిగ్‌బాస్ సీజన్-8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతానికి సింగిల్ అని అమ్మాయిలకు హింట్ ఇచ్చాడు. కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు చెప్పాడు. అలాగని ఏ అమ్మాయినీ వెతకబోనని, నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటుందని తెలిపాడు. హౌస్‌లో మనశ్శాంతి కావాలని, కాకపోతే అది దొరకదని తనకు తెలుసునని నిఖిల్ తెలిపాడు.
3వ కంటెస్టెంట్ అభయ్ నవీన్
Abhai Naveen: మూడవ కంటెస్టెంట్‌గా బరిలోకి దిగిన అభయ్ నవీన్ టాలీవుడ్‌లో తరచూ దర్శనమిస్తుంటాడు. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘పెళ్లి చూపులు’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్‌లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడు అతను. లెజెండరీ నటుడు ఏయన్నార్ నా నటనను మెచ్చుకున్నారని, నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించిందని, అప్పుడు ‘రామన్నయూత్’ చేశానని తెలిపారు. మళ్లీ ‘బిగ్‌బాస్’ అనే మంచి వేదిక దొరికిందన్నారు. ఉద్వేగాలను కనబడనీయకుండా ఉండాలని అనుకుంటున్నట్లు అభయ్ నవీన్ తెలిపారు.
4వ కంటెస్టెంట్ ప్రేరణ
Prerana: పాపులర్ హీరోయిన్ రష్మిక మందనకు క్లోజ్ ఫ్రెండ్ ప్రేరణ 4వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ తెలుగులోకి ప్రవేశించింది. కన్నడలో ‘రంగనాయకి’ టీవీ షోతో మంచి పాపులర్ అయింది ప్రేరణ కంభం. మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రేరణకు ఇటీవలనే పెళ్లయింది. నిద్ర అంటే తనకు ప్రాణమని చెపుతోంది. ”మంచి బంధాలు ఉండాలి. ఎప్పుడూ జాలీగా ఉండాలి. ఆటలు బాగా ఆడతా. నాతో పోటీ పడే కంటెస్టెంట్‌ల పరిస్థితి ఏంటా? అని ఆలోచిస్తున్నా. నేనూ హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకుని అర్ధరాత్రి తిరిగిన రోజులున్నాయి. నాకు పెళ్లయి ఎనిమిది నెలలు అయింది. మా ఆయన పేరు శ్రీ పాద్. నాకు హౌస్‌లో లిమిట్‌లెస్‌గా నిద్ర కావాలి” అని అంటోంది.
5వ కంటెస్టెంట్ ఆదిత్య ఓం
Aditya OM: ఆదిత్య ఓం ఓ తెలుగు హీరో. అది కూడా ఒకప్పుడు. ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆదిత్య ఓం. హౌస్‌లోకి వెళ్లే ముందు ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ”2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. జీవితం అంటే పోరాటం. 2010లో మళ్లీ కెరీర్ ప్రారంభించా. నాలుగు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించా. అవార్డులు వచ్చాయి. బిగ్‌బాస్ అనేది పెద్ద ఛాలెంజ్. నా కెరీర్‌లో మళ్లీ పుట్టేందుకు బిగ్‌బాస్‌కు వస్తున్నా. సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకున్నా. అందుకే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చెరుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశా. సామాజిక సేవలో ఉండే సంతృప్తి వేరుగా ఉంటుంది.” అని అన్నారు.
6వ కంటెస్టెంట్ సోనియా
Soniya: రాంగోపాల్ వర్మ హీరోయిన్ సోనియా బిగ్‌బాస్‌లోకి వచ్చిపడింది. రాంగోపాల్ వర్మ నుంచి వచ్చిన ‘దిశ’ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ”నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తా. నాకు నచ్చిన బాయ్‌కు తొమ్మిది నెలల టైమ్ పెడతా. నేను బిగ్‌బాస్‌కు రావడానికి కారణం కూడా ఉంది. డబ్బులున్న వాళ్లు కోట్లు పెట్టి ఇక్కడకు వద్దామన్నా కుదరదు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకొచ్చింది. హౌస్‌లో లిమిట్ లెస్‌గా ఫ్రెండ్స్ కావాలి. కళరి, కరాటే కూడా నేర్చుకున్నా. ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి” అని తన గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె గురించి రాంగోపాల్ వర్మ చెప్పిన మాటలను కూడా నాగార్జున ఒక ఏవీగా చూపించారు.
7వ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క
Bezawada Bebakka: సోషల్‌మీడియా స్టార్ బేబక్క బిగ్‌బాస్ 8 సీజన్‌లోకి వచ్చింది. తన మాటలు, ప్రాసలు, పంచ్‌డైలాగ్‌లో నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘బెజవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువ. అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నా. విజయవాడ-గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తుంటా. అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వ్యాఖ్యాతగా, గాయనిగా ఎంటర్‌టైన్ చేయడానికి నన్ను పిలుస్తుంటారు. హౌస్‌లో నాకు ఫుడ్ లిమిట్‌లెస్‌గా కావాలి’ అని చెప్పుకొచ్చారు. హౌస్‌లోకి వెళ్లేముందు నాగ్‌తో ఒక హగ్ అడిగి మరీ ఇప్పించుకొని వెళ్లింది.
8వ కంటెస్టెంట్ శేఖర్ బాషా
Shekar Basha: 100 గంటలు మాట్లాడి రికార్డు నెలకొల్పిన రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ బాష. ఇంజినీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 ఐఆర్‌ఎఫ్ అవార్డులు తీసుకున్నారు. తానెప్పుడూ యాక్టివిస్ట్‌గా మారతానని అనుకోలేదని అన్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్‌లో అసలు సిసలైన శేఖర్ బాషాను బిగ్‌బాస్‌లో చూడబోతున్నారంటూ వేదికపైకి వచ్చారు. ‘బిగ్‌బాస్‌కు రావడం నా కల. చాలా రోజుల నుంచి చూస్తున్నా. అందరినీ పిలిచి, నన్నెందుకు పిలవరని అనుకునేవాడిని. బిగ్‌బాస్‌లోనూ నా స్పందన తెలియజేస్తా. హౌస్‌లో నన్ను ఫ్రెండ్స్‌గా చూస్తే పర్వాలేదు. శత్రువుగా చూస్తే, బిగ్‌బాస్ టైటిల్ పట్టుకుపోతా” అని శేఖర్ చెప్పుకొచ్చారు. ఎనిమిదిని ఎనీమీ(శత్రువు)దిగా అభివర్ణించి ప్రేక్షకుల చేత తొలి రో్జే చప్పట్లు కొట్టించుకున్నాడు.
9వ కంటెస్టెంట్ కిరాక్ సీత
Kirrak Seetha: ‘బేబీ’ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత బిగ్‌బాస్ సీజన్-8లో అడుగు పెట్టారు. ”కిర్రాక్’ నా పేరు. నా పర్సనాలిటీ కూడా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చా. నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ వస్తున్నా. చాలా పాత్రలు చేశా. ‘బేబీ’లో నేను చేసిన పాత్రే నా నిజమైన క్యారెక్టర్ అనుకున్నారు. ఒక నటిగా చాలా సంతోషంగా ఫీలయ్యా. అయితే, వ్యక్తిగతంగానూ నన్ను అవమానించారు. ముందు ఒకలా, వెనుక మరొకలా ఉండే వాళ్లంటే నాకు కోపం. కెమెరా ముందు నటించాలి. వెనుక నటించకూడదు. నన్ను నేను నిరూపించుకునేందుకు లిమిట్‌లెస్‌గా అవకాశాలు కావాలి. నా కెరీర్‌లో నేను ఉన్నతంగా ఎదగాలి” అని చెప్పుకొచ్చారు. మూవీలో క్యారెక్టర్స్‌ను బట్టి ట్రోల్స్ చేయవద్దని ఈ సందర్భంగా నాగార్జున సినీ అభిమానులను, నెటిజన్లను కోరారు.
10వ కంటెస్టెంట్ నాగ మణికంఠ
Naga Manikanta: తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి ‘బిగ్‌బాస్’షోకు వచ్చినట్లు నాగ మణికంఠ తెలిపాడు. సామాన్యుడిగా సీజన్-8లో అడుగుపెట్టినట్లు మణికంఠ నేపథ్యం చూస్తే అర్థమవుతోంది. అతను వివాహం చేసుకొని అమెరికా వెళ్లి, భార్యతో విడాకులు తీసుకొని తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అమ్మంటే ప్రేమ, పిచ్చి. అమ్మే తన కూతురుగా పుట్టిందని చెప్పుకొచ్చాడు. అతను 10వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ 8లోకి అడుగుపెట్టాడు.
11వ కంటెస్టెంట్ పృథ్వీరాజ్
Prithviraj: 11వ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు పృథ్వీరాజ్ ప్రవేశించాడు. బడ్డీ కోసం ఒక అమ్మాయి బొమ్మను గీయమంటే అద్భుతంగా గీసి మెప్పించాడు. పాటలు కూడా పాడుతాడని చెప్పాడు. ”బిగ్‌బాస్ అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక. మనీ, పేరు కోసం ఈ షోకు వస్తున్నా. అలాగే ప్రేక్షకుల నుంచి లిమిట్‌లెస్ ప్రేమ కావాలి” అంటూ తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.
12వ కంటెస్టెంట్ విష్ణు ప్రియ
Vishnupriya: నటి, యాంకర్ విష్ణు ప్రియ కూడా బిగ్‌బాస్ సీజన్-8లోకి అడుగు పెట్టారు. తనకు ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లిమిట్‌లెస్‌గా కావాలని తెలిపారు. ఎన్నో సీజన్ల నుంచి విష్ణుప్రియ బిగ్‌బాస్‌లోకి వస్తుందని ప్రచారం జరిగినా, చివరకు 8వ సీజన్ ఆమెను వరించింది. పృథ్వీరాజ్‌తో కలిసి ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ విష్ణుప్రియ ఎవరో పృథ్వీకి తెలియదు. స్టేజ్‌పైనే పరిచయం చేసుకున్నాడు.
13వ కంటెస్టెంట్ నైనిక
Nainika: ఢీ డ్యాన్సర్ నైనిక కల నెరవేరింది. తన డ్యాన్స్‌తో ‘ఢీ’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు నైనిక. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-8లోకి అడుగు పెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ‘డ్యాన్సర్‌ను కాకపోతే, నటిని అయ్యేదాన్ని అని, నిత్యం కెమెరా ముందు ఉండాలన్నదే తన కల అని తెలిపింది. అమ్మకు కూడా అలాగే ఉండటం ఇష్టమని వివరించారు.
14వ కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది
Nabeel Afridi: వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నబీల్ అఫ్రిది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్‌లు చేయడం మొదలు పెట్టి సోషల్‌మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. బిగ్‌బాస్‌తో తన కల నెరవేరిందని తెలిపారు.
ఇదిలావుండగా, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తొలి రోజు పంచ్ డైలాగ్‌లతో నాగార్జున అలరించారు. ఇక తొలి రోజునే హీరో నాని, దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్‌లకు టాస్క్‌లు పెట్టారు. సరిపోదా శనివారం మూవీ హిట్ కావడంతో నాని మంచి హుషారుగా కన్పించాడు. హౌస్‌మేట్స్‌తో కలిసి కాసేపు ముచ్చటించారు. ఆయనతో పాటు హీరోయిన్ మాళవిక మోహనన్ వచ్చారు. ఆఖరిలో వచ్చిన అనిల్ రావిపూడి ఒక హౌస్ మేట్‌ను తొలిరోజేనే ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించి, ఆసక్తి రేపి, వారిని ఇబ్బందుల్లోకి నెట్టారు. నాగ మణికంఠను డోర్ దాకా తీసుకుపోయి, కంటెస్టెంట్స్‌లో ఆసక్తి రేపాడు. ఏదేమైనప్పటికీ, ఈసారి 14 మంది మాత్రమే హౌస్‌మేట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున హౌస్‌కు తాళం వేసి, యథావిధిగా మొదటిరోజుకు ముగింపు పలికారు. (Story: బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ 14… కండీషన్స్ లిమిట్‌లెస్!)