ఎఫ్ఎం రేడియోను ధర్మవరంలో ఏర్పాటు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :భారతదేశం లో గతంలో ఆల్ ఇండియా రేడియో నుంచి ఏ ఎం తరంగాలతో వార్తలు తదితర సమాచారాలను ప్రసారం చేస్తూ ఉన్నారు. నేడు ఆధునిక టెక్నాలజీ తో ఫ్రీక్వెన్సీ మాడ్యూలేషన్ తరంగాలతో ఎఫ్ఎం రేడియో టేషన్లు రావడం జరిగింది. ఈ రేడియో టేషన్లు ద్వారా ప్రసారమయ్యే అంశాలు ఉంటాయి. శ్రోతలకు స్పష్టంగా వినిపించే విధంగా ప్రచార కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆలిండియా రేడియో కూడా ఏఎం నుంచి ఎఫ్ఎం దిశగా వేగవంతంగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ధర్మవరంలో కూడా ఏఐఆర్ కు దీటుగా ఎఫ్ఎం రేడియోను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు చోట్ల ఆరు టేషన్లో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎం రేడియో ద్వారా విలువైన సమాచారాన్ని ఇకనుంచి శ్రోతకులు వినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా విందులైన పాటలను కూడా వినే అవకాశం ఉంది. ధర్మవరంలో ఎఫ్ఎం రేడియో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చిన్నచిన్న ఎఫ్ఎం స్టేషన్లో నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు ప్రసార సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే పెద్ద ఎఫ్ఎం స్టేషన్లో అయితే 80 కిలోమీటర్ల వరకు ప్రసారాలు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుందని ప్రచార శాఖ అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఎఫ్ఎం రేడియోలను ప్రతి స్మార్ట్ ఫోన్ లోనూ డౌన్లోడ్ చేసుకొని పాటలు కూడా విని అవకాశం ఉంది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న ధర్మవరం హిందూపురంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచార శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్ఎం రేడియో టేషన్లో ఏర్పాటు కానుండడం పట్ల ధర్మవరం పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Story : ఎఫ్ఎం రేడియోను ధర్మవరంలో ఏర్పాటు)