Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కంచే చేను మేస్తే

కంచే చేను మేస్తే

0

కంచే చేను మేస్తే

ఎమ్మెల్యేల పేరుతో నిలువు దోపిడీ..
ఫిర్యాదులను బుట్ట దాఖలు చేస్తున్న వైనం
కార్పొరేషన్‌ ఖజానకు భారీ నష్టం..

న్యూస్‌ తెలుగు/`విజయవాడ : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌లో ఎమ్మెల్యేల పేరుతో నిలువు దోపిడికి తెరలేచింది. మునుపెన్నడూ లేని విదంగా టౌన్‌ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు ప్రజా ప్రదినిదుల పేరు చెప్పి అక్రమ నిర్మాణాలపై భారీగా మామూళ్లు వసూలు చేస్తూ కొత్త పంతాకు తెరలేపి లక్షలు దండుకుంటున్నట్లు విమర్శలు వస్తుండటంతో నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కంచే చేనుమేసినట్లు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన పై అధికారులు మిన్నకుండి పోవటంపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నారు. కార్పొరేషన్‌ ఖజానాకు జమకావాల్సిన రూ.లక్షలు కొందరి అధికారుల జేబుల్లోకి వెళుతున్నాయి. కమిషనర్‌, ఆపై టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటే తప్ప వాస్తవాలు బయటకు రావని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నివాస గృహాలకు అనతి కాలంలోనే డిమాండ్‌ పెరిగింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుని నగరంలో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త భవన నిర్మాణాలతో పాటు పాత భవనాలపై అదనపు ప్లోర్లు నిర్మిస్తున్నారు. ఇందుకు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. కాని టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ నిబందనల మేరకు అదనపు ప్లోర్లుకు అనుమతులు వచ్చే అవకాశం లేదు. దీంతో కార్పొరేషన్‌ నుంచి టీడీఆర్‌ బాండ్లు కొనుగోలు చేసి తద్వారా టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులతో అదనపు ప్లోర్లు నిర్మించుకోవాల్సి ఉంది. తద్వారా నగర పాలక సంస్థకు భారీగా ఆధాయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాండ్లు కొనుగోలు చేసి భవనం నిర్మిస్తే అధిక ఖర్చు అవుతుందని భవన యజమానులు, తమకు మామూళ్లు రావని టౌన్‌ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు ఇరువురూ కుమ్మక్కై అక్రమ నిర్మాణాలు యదేశ్చగా నిర్మిస్తున్నట్లు నగరంలోని ఆయా ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. మరో ప్రక్క స్తోమతలేని వారు ప్రజా ప్రతినిదుల సిపార్సులతో ఒకటి అర అనుమతులు లేని భవన నిర్మాణం చేస్తే దాన్ని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కొందరు అడ్డం పెట్టుకుని బిల్డర్లు, భహుళ అంతస్తుల భవన యజమానులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి అధికారుల పట్ల ప్రజా ప్రతినిదులు, ఉన్నతాధికారులు ఉదాసీనత వహించటం విశేషం. ఇప్పటికైనా వీఎంసీ ఉన్నతాధికారులు, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకుని తద్వార కార్పొరేషన్‌కు ఆధాయాన్ని సమకూర్చాలని నగర వాసులు కోరుతున్నారు.
ఇవే అనధికారిక భవన నిర్మాణాలు
విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో వేగంగా అభివృద్ది చెందుతున్న దావుబుచ్చయ్య కాలనీలోని వినాయక్‌ నగర్‌లో సదరు బిల్డరు స్టిల్ట్‌GజీG2కు కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ నుంచి అనుమతులు తీసుకుని దానిపైన నిబందనలకు విరుద్దంగా అదనపు ప్లోర్‌ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని చూసీ చూడనట్లు ఉంటేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు రూ.5లక్షలు ముట్టజెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు, కార్పొరేషన్‌ ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదులు వెళ్లినా స్వలాభం కోసం అక్ర నిర్మాణాలు ప్రోత్సహించే కొందరులు అధికారులు వాటిని తొక్కిపెడుతున్నట్లు సమాచారం. అదే రీతిలో దావు బుచ్చయ్య కాలనీ 3వ రోడ్‌లో ఆర్‌ఆర్‌ వాటర్‌ ప్లాంట్‌ వెనుక వైపున స్టిల్ట్‌GజీG2కు టౌన్‌ ప్లానింగ్‌ నుంచి అనుమతులు తీసుకున్న భవన యజమాని దానిపైన టౌన్‌ ప్లానింగ్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అనధికారిక అంతస్తు నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రూ.2లక్షలు మింగేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అత్యంత విలువైన సత్యనారాయణపురం భగత్‌సింగ్‌ రోడ్‌లో స్టిల్ట్‌G2కు అనుమతులు తీసుకుని దానిపై అనధికారికంగా పెంట్‌ హౌస్‌ నిర్మిస్తున్నారు. అజిత్‌సింగ్‌ నగర్‌లోని నందమూరి నగర్‌ ఆర్‌ అండ్‌ బీ కాలనీలో స్టిల్ట్‌G2కు అనుమతులు తీసుకుని దానిపై అనధికారికంగా మరో ప్లోర్‌ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇలా అధికారులు లక్షలకు లక్షలు మామూళ్లు తీసుకుని కార్పొరేషన్‌ ఆధాయానికి భారీగా గండికొట్టటం ఎంతవరకు సభబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు వీఎంసీ ఉన్నతాధికారులు కాని టౌన్‌ అండ్‌ కండ్రీ ప్లానింగ్‌ అధికారులు కాని సమాదానం చెప్పాల్సి ఉంది. మరి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేదో..వేచి చూడాలి. (Story : కంచే చేను మేస్తే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version