Homeవార్తలుతెలంగాణహైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై విమర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి 

హైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై విమర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి 

హైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై విమర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి 

న్యూస్‌తెలుగు/వనపర్తి : పాలమూరులో పేదల ఇండ్లు కూల్చివేత, హైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం సెలెక్టెడ్ దాడులు చేస్తున్నదిఅని, బయటకు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుతాం అని చెబుతున్నా తీసుకుంటున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయిఅని అని అన్నారు. హైడ్రా కార్యాలయమే అలుగులో ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు .. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయి అని అన్నారు. ఏది సరిదిద్దగలం ? ఏవి సరిదిద్దలేం ? అన్న విచక్షణ లేకుండా తీసుకుంటున్న ప్రభుత్వ చర్యల మూలంగా ప్రజలు బాధితులు అవుతున్నారుఅని అన్నారు.
పాలమూరులో 75 మంది దివ్యాంగులు, దళితులైన పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గంఅని అన్నారు. ఇండ్ల కూల్చివేతలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను ప్రభుత్వం పాటించలేదుఅని విమర్శించారు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి హామీ ఇచ్చారు. 9 నెలలైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు .. పాలమూరులో పేదల ఇండ్లు కూల్చేశారుఅని అన్నారు. ఆ నిర్మాణాలు అక్రమం అయితే వారికి ప్రత్యామ్నాయం చూయించకుండా ఎలా కూలుస్తారుఅని, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదానికి పూర్తి విరుద్దంగా ఉందిఅని అన్నారు. , రైతుభరోసా రూ.15 వేలు అన్నారు .. రైతుబంధు రూ.10 వేలకే దిక్కులేదు అని
రూ.4 వేల ఆసరా ఫించన్ అన్నారు .. రూ.2 వేల ఫించన్లకే దిక్కులేదు అని , గురుకులాల విద్యార్థులే కాదు .. గురుకులాల ఉపాధ్యాయులు కూడా నేడు రోడ్డెక్కారు అని అన్నారు. ప్రజలను బాధితులను చేయడానికి పాలకులు ఉండరు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల మూలంగా ప్రజల విశ్వాసం కోల్పోవడమే కాకుండా త్వరలోనే ఈ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంది అని అన్నారు. (story : హైడ్రా పేరుతో ప్రభుత్వ చర్యలపై విమర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!