ఈనాడు, వర్లరామయ్యపై సజ్జల పరువు నష్టం దావా
న్యూస్‌తెలుగు/తాడేపల్లిః ‘ముంబై నటికి వేధింపులు… సజ్జల సహాయం’ పేరుతో కథనం ప్రచురించి, దుష్ప్రచారం చేసిన ఈనాడుతో పాటు, ఆ కథనం ఆధారంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యపై వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి వారికి లీగల్ నోటీస్‌లు పంపించారు. ముంబై నటిని వేధించి, డబ్బులు గుంజడానికి కొందరు వైసీపీ నాయకులు ప్రయత్నించారంటూ ఇటీవల వరుసగా సంచలన కథనాలు ప్రచురితమైన విషయం తెల్సిందే. (Story : ఈనాడు, వర్లరామయ్యపై సజ్జల పరువు నష్టం దావా)