వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తా
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యత చేపట్టిన సుభాష్ చంద్రబోస్ ని, శ్రీ వాసవి కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినుకొండ పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులందరూ కూడా మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో వ్యాపారస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే దానిని పరిష్కరిస్తామని తెలిపారు. వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలను నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోట బాలకృష్ణ రావు, సెక్రెటరీ చిలంకూరి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కోట వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మండవ వెంకట కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు, అన్నా వెంకట సుబ్బారావు, గజవల్లి వెంకట శివయ్య, ఆర్యవైశ్య యువ నాయకులు పువ్వాడ కృష్ణ, గుర్రం బాల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story :వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తా)