చనుబండ పారిశుధ్య కార్మికుల జీతాలు ఇప్పించండి….?
యివి శ్రీనివాస్
న్యూస్ తెలుగు/చాట్రాయి:
చనుబండ చెత్త సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్స్( పారిశుద్ధ్య కార్మికులు) జీతాలు 14 లక్షల రూపాయలు ఇప్పించాలని కోరుతూ సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ ఈవీ శ్రీనివాసరావు చాట్రాయి తాహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గురువారం మధ్యాహ్నం చాట్రాయి తహశీల్దారు డి ప్రశాంతి కి ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.2018 అక్టోబర్ నుండి 2022మార్చి వరకు మండలంలోని చనుబండ చెత్త సంపద తయారీ కేంద్రాల్లో ఐదు మంది దళితులు దానిలో పనులు చేయగా మొత్తం 41 నెలలకు గాను కేవలం రెండు నెలలకు నెలకు 6000 చొప్పున వారి ఖాతాలలో వేశారని మిగిలిన జీతం డబ్బులు వారి పేర్లు మార్చి వేరే వారి ఖాతాలలో వేయించారని ఆనాటి నుండి వారు వివిధ రూపాలలో పోరాటం చేస్తున్నారని అప్పట్లో జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న నిమ్మగడ్డ బాలాజీ స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారి జీతాలు వారికి ఇవ్వాలని చెప్పిన చెప్పడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టగా సిపిఐ జనసేన పార్టీలు వీరికి ఆనాడు అండగా నిలిచాయి . జీతాలువెంటనే ఇచ్చేయాలని సబ్ కలెక్టర్ ఆనాడు ఆదేశించారు. ఇన్ని జరిగిన ప్రభుత్వం మారినా పంచాయతీ కార్యదర్శి ప్రమోషన్ ఇచ్చారు గాని పారిశుధ్య కార్మికుల జీతాలు మాత్రం ఇవ్వలేదని వారి కూలి డబ్బులు వారికి వెంటనే ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు