పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పట్టణములో 23 వ వార్డుకు చెందిన పౌల్ట్రీ ఫార్మ్ అధినేత కె.మురళీధర్ రెడ్డి గారి సతీమణి కె.లలితమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆమెను పరామర్శించి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి కి ధైర్యం చెప్పారు. పాతకోట జయరెడ్డి గారి కుమారుడు జయచంద్ర రెడ్డి ఇటీవల మరణించినారు.వారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి మంజులను ఓదార్చి ధైర్యంగా ఉండాలి అని అన్నారు. పాంరెడ్డి పల్లి యువకులకు నివాళులు మాజీ మంత్రి అర్పించారు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బోయ.చందు,బోయ.అశోక్ గారికి గౌరవ నిరంజన్ రెడ్డి గారు నివాళులు అర్పించి వారి తల్లితండ్రులు కావాలి.వెంకటయ్య,శ్రీపురం.వెంకటస్వామి గార్లను పరామర్శించి ధైర్యం చెప్పారు.అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
నిరంజన్ రెడ్డి గారి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్,రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి,ఎం.డి గౌస్, వహీద్ చిట్యాల.రాము, నందిమల్ల.సుబ్బు,రామస్వామి,తోట.శ్రీను మరియు పామురెడ్డి పల్లి నాయకులు మన్నెపు రెడ్డి,నాగేంద్ర రావు,వెంకటయ్య తదితరులు ఉన్నారు. (Story : పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి)