పట్టణంలో రావుల చంద్రశేఖరరెడ్డి పర్యటన
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల.చంద్రశేఖర్ రెడ్డి పుల్లరి. లక్ష్మిసత్యనారాయణ కుమారుడు కృష్ణకుమార్ వివాహం అపర్ణతో సంఘం ఫంక్షన్ హాల్ నందు జరిగింది.ఇట్టి వివాహానికి రావుల చంద్రశేఖరరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం యాదవ సంఘం భవనంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొని పూజలు నిర్వహించారు.
రాజీవ్ చౌరస్తాలో ఎంకన్న టీస్టాల్ సందర్శించి చిరు వ్యాపారస్తులను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన రావుల.
22వ వార్డుకు చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త గొల్ల.పెద్దబాలయ్య ఇటీవల మరణించారు.రావుల చంద్రశేఖరరెడ్డి గారు వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు ధైర్యంగా ఉండాలి అని 10000రూపాయల ఆర్థిక సహాయం ఆయన భార్య మనెమ్మకు అందజేశారు. రావుల వెంట పి.రమేష్ గౌడ్ ,నందిమల్లా.అశోక్,ఎం.డి.గౌస్, ఎన్.రమేష్,మాధవ్ రెడ్డి,ధర్మా నాయక్,ఫజల్,ఖాదర్, ముద్దుసార్,కొత్తకోట.బాలయ్య ఉన్నారు. (Story : పట్టణంలో రావుల చంద్రశేఖరరెడ్డి పర్యటన)