రైతుల రుణామాపీ చేసిన ఘనత కాంగ్రెస్ కె దక్కుతుంది
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి. గనపాక సుధాకర్
న్యూస్ తెలుగు /ములుగు : రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ, సీతక్క ,ఆదేశాల మేరకు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు , ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ మాట్లాడుతు, తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి, ఎనిమిది నెలల అతికొద్ది సమయంలోనే, ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ ఆర్స్, సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రైతు డిక్లరే్సన్లో భాగంగా, రాహుల్ గాంధీ సమక్షంలో 2,00,000/-రూపాయలు రైతుల కు రుణమాఫీ చేస్తామని, మాట ఇచ్చినారని, ఆమాటను నిలబెట్టుకునే దిశగా, రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, రైతులకు ఏక కాలంలో 2,00,000/రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కె దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు.
కొన్ని సాంకేతిక లోపల వల్ల,రుణమాఫీ కానీ, రైతులకు కూడ రుణమాఫీ అవుతుందని, వాళ్ళు ఆదర్యాపడావల్సిన పని లేదని, స్వయంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,
చెప్పినారని, రుణమాఫీ పొందిన రైతులు వారి గ్రామాలలో, మండలాలలో, జిల్లలో రాష్ట్ర మంతట సంబరాలు జరుపుకుంటుంటే, అది ఓర్వలేక
ప్రతి పక్ష పార్టీ లు బి ఆర్ ఎస్, బి జె పి పార్టీ నాయకులు ప్రజలను, తప్పుదోవ పట్టించే దిశగా, కాంగ్రెస్ పార్టీ పై దురుప్రచారం చేస్తూ అక్కడక్కడా, వారి పార్టీ వ్యత్తుల తో ధర్నాలుచేయిస్తూ, కాంగ్రెస్ పార్టీ పై విషం కక్కుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న,మంచిపనులకు, మిగితా పార్టీ లకు, తెలియక,ఏంచెయ్యాలో తోచక, జుట్లు పీకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర రైతంగాన్ని కోరేది ఒక్కటే ,మీరు ఎవరి మాటలు నమ్మ కండి,మీదగ్గర లోని వ్యవసాయ అధికారి వద్దకు వెళ్లి, మీయొక్క సమస్య ను చెప్పుకోండి, వారు మీ రుణమాఫీ అయ్యే మార్గాన్ని చూపిస్తారని,అయన రైతులను అయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కత్తెరపెళ్లి భాస్కర్, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనిల్, జిల్లా నాయకులు మాదారపు రాజు, పెండ్యాల రామస్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story : రైతుల రుణామాపీ చేసిన ఘనత కాంగ్రెస్ కె దక్కుతుంది)