ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా కార్యాచరణ
న్యూస్‌తెలుగు/ అమరావతి: సోమవారం రోజు విజయవాడ లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దగ్గర నుండి వారి సమస్యలను వినతి పత్రాలు ద్వారా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
దివ్యాంగురాలి లో చదువుకు మంత్రి ఆర్థిక సహకారం
విజయవాడకు చెందిన దివ్యాంగురాలు బి.రూపశ్రీ ఎంబీఏ చదువు నిమిత్తం ఐసెట్ పరీక్ష రాయగా అందులో 82391 ర్యాంకు రాగా సదరు విజయవాడ, మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజ్ లో సీటు వచ్చింది. కాగా రూపశ్రీ తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నారు తన తల్లి తండ్రులకు చదివించే ఆర్థిక స్థోమత లేనందున తనని చదివించలేమన్నారు.
సదరు సమస్యను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి విన్నవించగా మానవత దృక్పథంతో ఆమెకు ₹20,000/- రూపాయలు ఆర్థిక సహకారం అందించి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. మంత్రి అందించిన సహకారం పట్ల రూపశ్రీ ఎంతగానో రుణపడి ఉంటానని తెలిపి ఆనందం వ్యక్తం చేసింది.
భూమి సమస్య పరిష్కారానికి కమీషనర్తో మాట్లాడిన మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా,ఇరగవరం మండలం, తూర్పువిప్పారు గ్రామానికి చెందిన గుడి మెట్ల కోటయ్య కు చెందిన వ్యవసాయ భూమి ని దేవాదాయ శాఖ బ్లాక్ లో పెట్టినందిన రిజిస్టర్ కాకపోవడంతో సమస్య మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి రాగా సంబంధిత ఎండోన్మెంట్ కమీషనర్ వారికి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దొంగ పత్రాలు స్పృష్టించిన వైసీపీ నేతలు
మదనపల్లి మండలం, బి. కె పల్లి గ్రామానికి చెందిన సి రాజేశ్వరీ 3.47 ఎకరాల భూమిని స్థానిక వైసీపీ నేతలు దొంగ పత్రాలు స్పృష్టించి అమ్మకం చేపట్టారని, తమ భూమిని తిరిగి తమకు ఇప్పించాలని రాజేశ్వరి భర్త మురళి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి సమస్యను తెలియజేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులకు సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఇవిగాక పదుల సంఖ్యలో వచ్చిన అర్జీలను మంత్రి స్వీకరించి, ముఖ్యమైన సమస్యలను స్వయంగా నమోదు చేసుకుని, త్వరితగతిన అధికారులు సమస్యల పరిష్కారం చేపట్టాలని అదేశాసించారు. (Story : ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా కార్యాచరణ)