Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జరిగిన సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి

నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జరిగిన సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి

0

నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జరిగిన సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వినుకొండ జోన్ టీచర్స్ నాయకుల డిమాండ్..

న్యూస్‌తెలుగు/ వినుకొండ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడానికి ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియకు సంబంధించి కొన్ని విధి విధానాలను సి.ఎస్. ఈ వారు ప్రకటించారు. ఆ నిబంధనల ప్రకారం ముందుగా మండల స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టులను ప్రకటించి, వాటిపైన అభ్యంతరాలను సేకరించిన తర్వాత మండలంలో ఉన్న వేకెన్సీ పోస్టులను ప్రదర్శించి, ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో కౌన్సిలింగ్ నిర్వహించి, సీనియార్టీ క్రమంలో పాఠశాలలను ఎంచుకునే విధంగా విధివిధానాలు సిఎస్సి వారు నిర్ణయించారు. స్కూల్ అసిస్టెంట్లను మండల స్థాయిలో సర్దుబాటు చేసిన తర్వాత సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులలో సబ్జెక్ట్ మెథడాలజీ ఉన్న ఉపాధ్యాయులను సీనియార్టీ లిస్టులు ఆధారంగా గుర్తించి మండల స్థాయిలో వారిని సర్దుబాటు చేయాలి, కానీ మెథడాలజీ ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను సీనియార్టీ లిస్టులు ప్రకటించకుండానే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈపూరు, బొల్లాపల్లి, వినుకొండ మండలాల్లో ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా సర్దుబాటు చేయడాన్ని ఏపీటీఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తుంది. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి పేద విద్యార్థుల చదువులను పక్కనపెట్టి ప్రభుత్వ సర్దుబాటు ప్రక్రియకు ముందే వినుకొండ నియోజకవర్గం లోని పలు మండలాల నుండి జిల్లా కేంద్రాలకు మరియు సమీప పట్టణాలకు జరిగిన అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దుచేసి తదుపరి మిగులు ఉపాధ్యాయులకు సర్దుబాటు కౌన్సిలింగ్ నిర్వహించాలి. సి.ఎస్.ఈ వారి నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా సర్దుబాటు చేయడాన్ని ఏపీటీఎఫ్ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జరిగిన సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలిపివేసి సీనియార్టీ లిస్టులో ప్రకటించి ప్రత్యక్ష కౌన్సిలింగ్ జరపాలని ఏ.పి.టి.ఎస్ వినుకొండ జోన్ టీచర్స్ నాయకులు మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫుల్లా ను కలసి వినతి పత్రం అందజేశారు. (Story : నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా జరిగిన సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version