Homeవార్తలుటీఎస్‌సీఎస్‌ హైదరాబాద్‌ని సందర్శించిన నోవార్టిస్‌ గ్లోబల్‌ టీమ్‌

టీఎస్‌సీఎస్‌ హైదరాబాద్‌ని సందర్శించిన నోవార్టిస్‌ గ్లోబల్‌ టీమ్‌

టీఎస్‌సీఎస్‌ హైదరాబాద్‌ని సందర్శించిన నోవార్టిస్‌ గ్లోబల్‌ టీమ్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: తలసేమియా మరియు సికిల్‌ సెల్‌ సొసైటీ (టీఎస్‌సీఎస్‌), హైదరాబాద్‌ను నోవార్టిస్‌ గ్లోబల్‌ బృందం సందర్శించింది. ఈ ప్రతినిధి బృందంలో స్విట్జర్లాండ్‌ నుండి గ్లోబల్‌ మెడికల్‌ ఆపరేషన్స్‌, గవర్నెన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తంజా రౌచ్‌, సీనియర్‌ క్లినికల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ డాక్టర్‌ బరున్‌ రాయ్‌, లీడ్‌ క్లినికల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ డాక్టర్‌ షర్మిలా తౌడం ఉన్నారు. హైదరాబాద్‌లోని టీఎస్‌సీఎస్‌ కార్యకలాపాలు, నిర్వహణతో పాటుగా సికిల్‌ సెల్‌ అనీమియాతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక సంరక్షణను అందించడంలో సొసైటీ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడం, అవగాహన పొందడం ఈ సందర్శన ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రతినిధి బృందం సికిల్‌ సెల్‌ డిసీజ్‌ని నివారించే లక్ష్యంతో జరుగుతున్న పరిశోధనలకు సహకారం కోసం సంభావ్య మార్గాలను అన్వేషించింది. సికిల్‌ సెల్‌ డిసీజ్‌ కోసం నవజాత శిశువుల స్క్రీనింగ్‌లో సహకరించే అవకాశం గురించి చర్చలపై సైతం దృష్టి కేంద్రీకరించింది. ప్రభావిత వ్యక్తులలో అనారోగ్యం, మరణాలను తగ్గించడానికి ముందుగా గుర్తించటం, చికిత్స చేయటం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. (Story : టీఎస్‌సీఎస్‌ హైదరాబాద్‌ని సందర్శించిన నోవార్టిస్‌ గ్లోబల్‌ టీమ్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!