ఫౌండేషన్ డే సందర్భంగా బంధన్ బ్యాంక్ రెండు ఆవిష్కరణలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బంధన్ బ్యాంక్ మహిళల కోసం అవని పేరిట ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ఆవిష్కరించింది. అలాగే ఎంటర్‌ప్రైజ్‌వ్యాప్తంగా వినూత్నమైన బంధన్ బ్యాంక్ డిలైట్స్ లాయల్టీ ప్రోగ్రాంను కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఈ ప్రోగ్రాం కింద కస్టమర్లు, డిలైట్ పాయింట్స్ పేరిట రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. అలా పోగుపడిన డిలైట్ పాయింట్లను తమ కొనుగోళ్ల కోసం ఉపయోగించుకోవచ్చు మరియు ప్రత్యేక ఆఫర్లను కూడా ఆస్వాదించవచ్చు. అవనితో కస్టమర్లు ఎక్స్‌క్లూజివ్ డెబిట్ కార్డును పొందవచ్చు. దీంతో ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ, కార్డు పోతే రూ. 3.5 లక్షల లయబిలిటీ, ఖర్చు చేయడాన్ని బట్టి ప్రీమియం బ్రాండ్స్ నుంచి బహుళ మైలురాళ్ల ఆధారిత ఆఫర్లను పొందవచ్చు. అవనితో వార్షిక లాకర్ రెంటల్స్, బంగారం రుణాల ప్రాసెసింగ్ ఫీజులపైనే కాకుండా బ్యూటీ మరియు వెల్‌నెస్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తాయి. (Story : ఫౌండేషన్ డే సందర్భంగా బంధన్ బ్యాంక్ రెండు ఆవిష్కరణలు)