Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకి ముఖ్య‌మంత్రి చేతులు మీదుగా స‌న్మానం

రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకి ముఖ్య‌మంత్రి చేతులు మీదుగా స‌న్మానం

0

రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకి ముఖ్య‌మంత్రి చేతులు మీదుగా స‌న్మానం

న్యూస్‌తెలుగు/ అమ‌రావ‌తి :  ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్నాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. (Story : రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకి ముఖ్య‌మంత్రి చేతులు మీదుగా స‌న్మానం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version