Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  ఎసెన్నియా ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ పేలుడు

 ఎసెన్నియా ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ పేలుడు

0

 ఎసెన్నియా ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ పేలుడు

18 మంది కార్మి కులు మృతి

న్యూస్‌తెలుగు/వినుకొండ : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్చుతాపురం లో ఫార్మా సెజ్ లోని ఎసెన్నియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు ప్రమాదం సంభవించి 18 మంది కార్మి కులు మృతి చెందడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం ఆయన వినుకొండ వచ్చిన సందర్భంగా సిపిఐ కార్యాలయం శివయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ళ మాట్లాడారు. అచ్చుతాపురం ఘటన ప్రేలుడు సంఘటనపై యాజమాన్యమే నిర్లక్ష్యమైతే ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని యాజమాన్యాన్ని శిక్షించి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ముప్పాళ్ళ డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు, మహిళా డాక్టర్లపై మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్న వారిపై నిర్భయ చట్టం కఠినంగా అమలు చేయాలని, చట్టం ఉన్నప్పటికీ మానవ మృగాలలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. మహిళలను దేవతలగా భావించాల్సిన మనుషులు మృగాలుగా మారుతున్నారని ఆయన అన్నారు. సినిమాలలో, టీవీలలో అశ్లీల దృశ్యాలు నియంత్రించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. తల్లికి, చెల్లికి వందనం అనే అంశంపై పాఠ్యాంశాలలో గౌరవం కల్పించే విధంగా ప్రచురించాలని, వికృత సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ వికృత సంస్కృతిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత వైసిపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి బలహీనపరిచిందని, న్యాయవ్యవస్థను మరింత బలహీనపరిచిందన్నారు. నూతన ప్రభుత్వం నిర్వీరమైన అన్ని వ్యవస్థలపై అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా ప్రజా చైతన్యంతో వినుకొండలో పశు ప్రవర్తన కలిగిన బొల్లా బ్రహ్మనాయుడుని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి మంత్రులను సైతం ఓడించి వైసిపికి కేవలం 11 సీట్లుకి మాత్రమే పరిమితం చేశారన్నారు. ప్రజలను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదని ముప్పాళ్ళ ఉద్ఘాటించారు. సిపిఐ నాటినుండి నేటి వరకు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నది అన్నారు. ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు తాను దైవాంత సంభూతుడునని చెప్పుకుంటూ ప్రచారం లో గావు కేకలు పెట్టినప్పటికీ ప్రజలు పరిమిత సీట్లనే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ సూచనలను, మాటలను విన్నట్లయితే మోడీ ప్రభుత్వం వచ్చేది కాదన్నారు. ఇక వినుకొండ ప్రాంతం ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతమని, లౌకిక తత్వంతో ముందుకు సాగుతూ ఉండేదని, కమ్యూనిస్టు పార్టీ పటిష్టంగా ప్రజా ప్రతినిధులతో ఉన్న కాలంలో మతసామరస్యం తో లౌకికవాదంతో ప్రజలు ఎంతో అన్యోన్యంగా ఉండే వారన్నారు. నేడు మైనారిటీ హత్యలు వివిధ వర్గాల పై దాడులు అధికమయ్యాయి అన్నారు. అలాగే పులిచింతల తదితర ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయి. అస్తవ్యస్తంగా ఉన్నాయని, వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్నారు…. పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. పల్నాడు జిల్లాలో పలు సమస్యలపై ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వరికపూడిసెల పనులు ప్రారంభించాలని, ఆ పనులు పూర్తయితే మాచర్ల, దుర్గి, బొల్లాపల్లి తదితర మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి అన్నారు. గత ఐదు ఏళ్లుగా బొల్లాపల్లి మండలం పలు గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు లేక అల్లాడుతూ వలస బాట పట్టారన్నారు. కాగా రాష్ట్రవ్యాప్త భూభాదితుల సమస్యలపై ఈనెల 28వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించుచున్నారని, పలు సమస్యలపై ప్రభుత్వానికి అర్జీ ఇవ్వనున్నట్లు జిల్లావ్యాప్తంగా భూభాదితులంతా ఈ సదస్సుకు తప్పనిసరిగా హాజరుకావాలని మారుతి కోరారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు సండ్రపాటి సైదా, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఉట్ల రామారావు, ఎస్కే. కిషోర్, ఆర్ వందనం పాల్గొన్నారు. (Story :  ఎసెన్నియా ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ పేలుడు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version