54% పెరిగిన ఇండెల్ మనీ వితరణ
ముంబై: ఇండల్ కార్పొరేషన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) ఇండెల్ మనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమ కార్యకలాపాల ద్వారా ఆదాయంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసినట్లు ప్రకటించింది. క్యూ1ఎఫ్‌వై25లో కార్యకలాపాల ద్వారా కంపెనీ మొత్తం ఆదాయం రూ.78.52 కోట్లుకు చేరుకుంది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 65.52 కోట్లతో పోలిస్తే 19.84% పెరుగుదలను నమోదు చేసింది. లాభంలో వృద్ధి రూ.16.76 కోట్లుగా నమోదైంది. కంపెనీ యొక్క డెట్-టు-ఈక్విటీ నిష్పత్తి కూడా ఈ త్రైమాసికంలో మెరుగుపడిరది, ఇది తక్కువ పరపతి, గణనీయమైన నగదు ప్రవాహ ఉత్పత్తికి సంకేతంగా నిలుస్తుంది. త్రైమాసిక ఫలితాలపై ఇండెల్ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ, అధిక వడ్డీ రేటు విధానం, ఆర్‌బిఐ నిబంధనల కారణంగా నిధుల పరిమితులు ఉన్నప్పటికీ, క్యూ1ఎఫ్‌వై25లో మా పనితీరు, స్థిరమైన వృద్ధి, ప్రతి త్రైమాసికంలో కార్యాచరణ నైపుణ్యంని కొనసాగించడంలో తమ పట్టుదల, నిబద్ధతను వెల్లడిస్తుందని అన్నారు. (Story : 54% పెరిగిన ఇండెల్ మనీ వితరణ )