రాజకీయ భూరాబందులను శిక్షించేది ఎప్పుడు
అసలైన భూ బాధితులకు న్యాయం జరిగేది ఎన్నడు
ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి
రాజకీయ అండతో జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల భూములు కబ్జాలకు గురైనాయి
లోకేష్ రెడ్ బుక్ లో పేజీలు ఉన్నాయా చిరిగిపోయాయ!
ఈనెల 28న విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ భూభాధితుల భూసదస్సు
భూములు కోల్పోయిన భూ బాధితులకు అండగా సిపిఐ ఉంటుంది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య
న్యూస్‌తెలుగు/ పల్నాడు జిల్లా : పేదలకు చెందవలసిఉన్న భూములను పెద్దమనుషులు అనే ముసుగులో భూములన్నిటిని దోచుకుంటున్నారని సోమవారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో అతిధిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య అన్నారు.
ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పెద్దమనుషుల పేరుతో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రాజకీయ నాయకత్వాల ముసుగులో వేల ఎకరాలు దోచుకుంటున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అసైన్ భూమిని బాలాజీ వెంచర్ లో 40 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ని ప్రభుత్వ అధికారులు విచారించి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదలుకొని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద ఉద్యోగాలు చేశారని భూ రికార్డులు మొత్తం వారి వద్దకు తీసుకువెళ్లి అసైన్డ్ భూములు దేవాదాయ భూములు ఇనాము భూములు వక్ట్స్ బోర్డ్ భూములు అటవీ భూములు, కొండలు గుట్టలు చెరువులు ఇది అది అని లేకుండా అన్నింటిని ఆన్లైన్లో చేయించారని, ఈ పెద్ద మనుషులు అనే రాజకీయకు రాబందులు కబ్జా చేసి మరలా తిరిగి అమ్మి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని, ఇవన్నీ కూడా రాజకీయ అండదండలతో జరిగాయని, వీటి పైన సమగ్ర విచారణ అది ఏ రాజకీయ పార్టీలో ఉన్న వారిపైన తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర రెడ్ బుక్కు ఉంది ఎవరిని వదలను అందరిపై చర్యలు తీసుకుంటాము అని చెప్పడమే తప్పితే ఆచరణలో అసలు ఆ రెడ్ బుక్కు లో పేజీలు మిగిలి ఉన్నాయా! చిరిగిపోయాయా! అనే అనుమానాలు రాష్ట్ర ప్రజానీకానికి తలెత్తుతున్నాయని రెడ్ బుక్కులో పేజీలు మార్చవద్దు, చించవద్దు పేదలకు న్యాయం జరిగే విధంగా ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్న దాని అనుబంధాలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా సరే వారందరిపై సమగ్ర విచారణ జరిపి సరైన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో ఉన్నటువంటి రెవిన్యూ భూ బాధితుల, రాజకీయ రాబందుల భూ బాధితుల అఖిలపక్ష సదస్సు ఈనెల 28 తేదీన విజయవాడలో నిర్వహించి పేదల పక్షాన రైతుల పక్షాన భూ బాధితుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి రాయబారిగా సిపిఐ నిర్వహిస్తుందని. రానున్న కాలంలో రెవిన్యూ, రాజకీయ భూ బాధితుల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ఎవరికి చెందవలసిన భూములు వారికి దక్కే విధంగా సిపిఐ పోరాడుతుందని వారు అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో దశాబ్దాల కాలంగా అమలుకు నోచుకోని వరికపూడిశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించి వెంటనే పనులు చేపట్టాలని, పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా వెల్దుర్తి దుర్గి కారంపూడి బొల్లాపల్లి పుల్లలచెరువు మండలాల ప్రజలకు త్రాగునీరు లక్ష ఎకరాల సాగు నీరు అందడం మూలంగాపల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల తీరుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అర్హులైన వారికి టిట్కో గృహాలను పంపిణీ చేయకుండా ఇబ్బందులపాలు చేసిందని వెంటనే టిట్కో గృహాలను మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు ఏర్పరచి అర్హులైన వారికి వెంటనే పంపిణీ చేయాలని. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తానన్న రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు భూమిని ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు నాలుగు లక్షలు ఇస్తాము అని చెప్పిన హామీ మేరకు అమలు జరపాలని, వినుకొండ అజాద్ నగర్ కాలనీలో ఉన్న నిరుపేదలకు మంచినీటి కరెంటు వసతులు కల్పించి వారికి మౌలిక వసతులన్నీ కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అన్నిటిని కక్ష సాధింపు చర్యలు లేకుండా అర్హులైన అందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగ అనారోగ్య పెన్షన్లను అందరికీ చెందేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చిలకలూరిపేట ప్రాంతానికి సాగర్ నీరు కాలువ చివర ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మాచర్ల గురజాల దాచేపల్లి ప్రాంతాలలో ఉన్నరైతులు ఫ్యాక్టరీలకు ఇచ్చిన భూములపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని లేదా ఆ భూములను రైతులకి అప్పజెప్పాలని, టిడ్కో గృహాలు ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీలలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం విచారించి తగు చర్యలు తీసుకుని అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.పల్నాడు జిల్లా లోని వివిధ సమస్యలపై కలెక్టర్ కు అర్జీలు ఇచ్చి అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు సమస్యలు పరిష్కారం కానీ ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ధర్నాలో వక్తలు వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసారాంబాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుదాల శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు షేక్ సుభాని, సిపిఐ నాయకులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు, కే మల్లికార్జున రావు, వూట్ల రామారావు, సూర్య అప్పారావు, సత్యనారాయణ రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లూరు బాబురావు, ఏఐటీయూసీ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, దాసరి వరహాలు, లక్షాధికారి కొండలరావు, మల్లి, నాయక్,తదితరులు పాల్గొన్నారు. (Story : రాజకీయ భూరాబందులను శిక్షించేది ఎప్పుడు)