తక్షశిల కార్యక్రమానికి ట్రైడెంట్ గ్రూప్ శ్రీకారం
న్యూస్‌తెలుగు / ముంబయి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన గ్రూప్‌గా, 2 బిలియన్ డాలర్ల సంస్థకు ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన సంస్థ ట్రైడెంట్ గ్రూప్. అలాంటి సంస్థ ఇప్పుడు తక్షశిల అనే కార్యక్రమాన్ని సగర్వంగా ప్రకటించింది. ఇది ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్ కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం. దీనిద్వారా 2000 మంది కొత్త ఉద్యోగుల్ని తీసుకుని వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి కూడా చూపేంచే అద్భుతమైన కార్యక్రమమే తక్షశిల. 2000 మంది కొత్త ఉద్యోగుల్ని ప్రధానంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగఅవకాశాలు కల్పించినట్లు అవుతుంది, అలాగే అక్కడి యువతలో నైపుణ్యాలు కూడా మరింతగా అభివృద్ధి చెందుతాయి. తక్షశిల కార్యక్రమం ద్వారా ప్రధానంగా ఐటీఐ, డిప్లొమాలు, 10G2 విద్యను అభ్యసించిన యువతకు ఒక అద్భుతమైనన వేదికను అందించడమే లక్ష్యం. దీనిద్వారా విద్యాపరమైన అడ్డంకులను విచ్ఛిన్నం చేయడం ద్వారా, తక్షశిల నిరంతర అభివృద్ధి మరియు వ్యక్తిగత అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తుంది.(Story :తక్షశిల కార్యక్రమానికి ట్రైడెంట్ గ్రూప్ శ్రీకారం)