అమరావతిలో ‘విలాసం ఎస్టేట్స్’
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ధి చెందిన బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ తన తాజా ప్రాజెక్ట్ ‘విలాసం ఎస్టేట్స్’ను పరిచయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల అవుట్ లుక్ బిజినెస్ స్పాట్ లైట్ రియాలిటీ అవార్డు వచ్చింది. ఈ అవార్డును సినీ నటి శృతి హాసన్ చేతుల మీదుగా బీబీజీ ఫౌండర్ మల్లికార్జున రెడ్డి అందుకున్నారు. బిజినెస్ మింట్, నేషన్ వైడ్ అవార్డ్‌ల ద్వారా గుర్తింపు పొందింది, రియల్ ఎస్టేట్ రంగంలో ఆవిష్కరణ, నాణ్యతకు బీబీజీ నిబద్ధత మరోసారి నిరూపితమైంది. బీబీజీ పదిహేడు సంవత్సరాలుగా ప్లాట్లు కొనుగోలు అవకాశాలను అందించడంలో ముందంజలో ఉంది. సురక్షితమైన భవిష్యత్తు కోసం విలువైన ఆస్తులను నిర్మించడం ద్వారా కస్టమర్లకు దీర్ఘకాలిక సంపదను సృష్టిస్తుంది. భూమి పరిమిత వనరు కావడంతో ఈ వెంచర్‌లు కాలక్రమేణా స్థిరంగా విలువను పెంచుతాయి. సంపద సృష్టికి ఈ నిబద్ధత విభిన్న ప్లాట్ల పరిమాణాలలో ప్రతిబింబిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశం ఇస్తుంది. బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ తన లాభాలలో కొంత భాగాన్ని విద్య, ఆడపిల్లల సాధికారత కోసం వినియోగిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 1.7 లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించింది. 2040 నాటికి 20 లక్షల మంది బాలికలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవా గుణంతో సామాజిక బాధ్యత గల సంస్థగా నిలిచింది. సమాజ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. (Story : అమరావతిలో ‘విలాసం ఎస్టేట్స్’ )