Home వార్తలు తెలంగాణ బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న

బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న

0

బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న

ఆయ‌న‌ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సర్వాయి పాపన్న 374వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్ తో కలిసి ముఖ్య అతితులుగా హాజరై సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కొని బహుజనులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బహుజనులకు చేరడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సర్వాయి పాపన్న ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ యం. నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటిసి వామన్ గౌడ్, సంఘ నాయకులు, జిల్లా అధికారులు సైతం సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బి.సి. సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి, గంధం నాగరాజు, కొల్ల శివ సైతం పాల్గొన్నారు. (Story : బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version