Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆగస్టు  17న వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ

ఆగస్టు  17న వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ

0

ఆగస్టు  17న  వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ

కోల్ కత్తా లో జరిగిన వైద్యురాలి అత్యాచారం,

హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్

న్యూస్‌తెలుగు/విజయనగరం : కోల్ కత్తా లో ఆర్.జీ.కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9 న రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ, దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆర్ జి కర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు, వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీముకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తేదీన 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా విజయనగరం శాఖ
కూడా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలోని/పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో, అత్యవసర సేవలు మినహాయించి, ఓపిడి సేవలు, అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు పూర్తిస్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని ఐఎంఏ విజయనగరం శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి,సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి,నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వెంటనే ప్రభుత్వాలు స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే రానున్న కాలంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామన్నారు. వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజలు,ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ అశోక్, డాక్టర్ జెసి నాయుడు, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. (Story :ఆగస్టు  17న వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version