Homeవార్తలుహాస్యపు జల్లులతో తడిసి ముద్దయిన ప్రేక్షకులు

హాస్యపు జల్లులతో తడిసి ముద్దయిన ప్రేక్షకులు

హాస్యపు జల్లులతో తడిసి ముద్దయిన ప్రేక్షకులు

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: మాజీ ఆర్మీ అధికారి కెప్టెన్‌ అహ్మద్‌ రచించిన హాస్యభరిత నాటకం ‘బాసిర మాతా కి జై’ ను రోడ్డువేజ్‌, స్ట్రీట్‌ ప్లే థియేటర్‌ ఆధ్వర్యంలో బంజారా హిల్స్‌, హైదరాబాద్‌లోని లమకాన్‌లో ప్రదర్శించారు. ఈ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నటీనటుల అద్భుత ప్రదర్శన కనువిందు చేసింది. అలనాటి హిందీ పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఆ పాటలు వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల సైతం శృతి కలిపారు. నలబై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ నాటకం అద్భుతమైన మెసెజ్‌ ఇచ్చింది. హిందీ థియేటర్‌, భాషా రంగంలో పని చేస్తున్న కెప్టెన్‌ అహ్మద్‌ ఈ నాటకాన్ని రచించారు. ఈ నాటకానికి ఆయనే దర్శకత్వం వహించారు. (Story :హాస్యపు జల్లులతో తడిసి ముద్దయిన ప్రేక్షకులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!