Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టీటీడీ ఆధ్వర్యంలో శ్రావణమాస మహోత్సవాలు

టీటీడీ ఆధ్వర్యంలో శ్రావణమాస మహోత్సవాలు

0

టీటీడీ ఆధ్వర్యంలో శ్రావణమాస మహోత్సవాలు

న్యూస్‌తెలుగు/విజయనగరం : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం మన్యం జిల్లాలలో శ్రావణమాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామింగ్ అధికారి జె.శ్యాంసుందర్ తెలిపారు. మంగళవారం దీనికి సంబంధించిన ఫ్లెక్సీ బోర్డును స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా ఈ నెల 16న స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, 19న సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీవారి శ్రవణా నక్షత్రం కళ్యాణం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరుగునన్నారు. అదేవిధంగా ఈనెల 27న శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గోపూజ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపసీలలో ఉన్న శ్రీరామాలయంలో జరుగునని వీటితోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రావణమాసం సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొనాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పివి నరసింహాచార్యులు, అమ్మానాన్న సేవా సంస్థ కార్యదర్శి జివి తిరుపతిరావు, బుచ్చి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. (Story : టీటీడీ ఆధ్వర్యంలో శ్రావణమాస మహోత్సవాలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version