సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముగిసిన జాబ్ మేళా
న్యూస్‌తెలుగు/ విజయనగరం : స్ధానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో మంగళవారం సత్య కళాశాల, క్రిస్టల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, విశాఖపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ , అరబిందో ఫార్మా కంపెనీ లు ప్రొడక్షన్ విభాగం లో ఉద్యోగాలకు ఇంటర్వూ లను నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియ కంపెనీ డిప్యూటీ మేనేజర్లు ఎ. వీరభద్ర రావు, రాజ శేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ హెచ్ ఆర్ ఓ. మారేశ్వర రావు, రిక్రూట్ మెంట్ హెడ్ ఆర్. విజయ కృష్ణ విచ్చేసారు.స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ లను నిర్వహించి అభ్యర్థులను ఎన్నుకున్నారు. మొత్తం 170 మంది అభ్యర్దులు ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాగా 41 మందిని ఎంపిక చేసారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు మాట్లాడుతూ ఉద్యోగాలు పొందడం చాలా కష్టంగా వున్న నేపథ్యం లో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడ ఉద్యోగం వచ్చిన జాయిన్ అయిపోవాలని అప్పుడే ఎక్సపిరియన్స్ వచ్చి ఇంకా మంచి అవకాశాలను దక్కించుకుంటారు అని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి ఆధ్వర్యం లో ఈ జాబ్ మేళా ను నిర్వహించటం జరిగింది. (Story : సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముగిసిన జాబ్ మేళా )