ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
న్యూస్‌తెలుగు/కొమురం భీం : ఆసిఫాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం,కళాశాలలో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ లలో పనిచేస్తూ మరణించిన మహిళా ఉద్యోగినులకు నివాళులు అర్పించారు. సమగ్ర శిక్షలో పనిచేయుచున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని కారణంగా,తక్కువ వేతనాలతో పని చేయడం వల్ల, మానసిక వత్తిడి లోనై, పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా వేతనాలుసరిపోకపోవడంతో,కుటుంబ పోషణ భారాన్ని మోయలేక నిరాశ నిస్పృహలకు లోనై గుండెపోటుతో,ఇతర అనారోగ్య కారణాల వల్ల సగటున నెలకు ఇద్దరి చొప్పున మరణిస్తున్నారు.కావున వెంటనే ఉద్యోగ భద్రతను కల్పించాలి. సమగ్ర శిక్షలో పనిచేయుచున్న ఉద్యోగుల అందరికీ హెల్త్ కార్డులు మంజూరి చేయాలి. సమగ్ర శిక్షలో మరణించిన ఉద్యోగులకు 1000000/- ఎక్స్గ్రేషియాను అందించాలి.సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.అప్పటివరకు మినిమం టైం స్కేల్ ను వర్తింప చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ అరుణ పీజీ సిఆర్టి లు,సిబ్బంది పాల్గొన్నారు. (Story : ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి)