Home వార్తలు తెలంగాణ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని వినతి

కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని వినతి

0

కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని వినతి

న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ బస్టాండులో కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని కంట్రోలర్ కు బాధితురాలు వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల డిపో నుండి కాగజ్నగర్ బస్టాండ్ కు వస్తున్న ఆర్టీసీ బస్ టీఎస్ 19 టి 9239 బస్సు ఎక్కడానికి వెళ్తున్న క్రమంలో కండక్టర్ మహిళ అని చూడకుండా కాల్ తో కొట్టి బస్సు ఎక్కకు,అని బూతు మాటలు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారని కంటతడి పెట్టింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను గౌరవిస్తూ ఉచిత ప్రయాణం కల్పిస్తే కొంతమంది కండక్టర్ మహిళలపై చిన్న చూపు చూసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను కించపరుస్తున్నారని మహిళల పట్ల ఇంత చిన్నచూపు చూడడం బాధాకరమని మహిళను కించపరిచిన కండక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మా గోడును విన్నవిస్తామని మహిళ తెలిపారు.ఆర్టీసీఎండి సజ్జనార్, డిపో మేనేజర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళ ప్రయాణికురాలు డిమాండ్ చేశారు. (Story : కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని వినతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version