ప్రమాదంలో వనపర్తి రాజప్రసాదం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రమాదంలో వనపర్తి రాజప్రసాదం. నడుము లోతు నీళ్లలో పాలిటెక్నిక్ కళాశాల బేస్మెంట్. రాజ భవన్ పై నీలి నీడలు. రాష్ట్రానికి వన్నెతెచ్చిన పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రమాదంలోకి. రోడ్డు ఎత్తుగా వేయడం వలన వర్షపు నీరు నేల మాలిగలోకి, బేస్మెంట్ దగ్గర లోపలికి పోవడంతో కుంగిపోయే అవకాశం. చారిత్రాత్మక భవనం కూలిపోయే ప్రమాదం.
విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పరిశీలించి మాట్లాడుతూ,
గత కొన్ని సంవత్సరాల కాలంగా రాజభవనాన్ని రక్షించాలని ఐక్యవేదిక పోరాటం చేసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారికి వినతిపత్రం ఇచ్చి వారి ద్వారా ఆర్థిక శాఖకు ఎస్టిమేట్ పంపించడం జరిగింది. దానితో మాజీ మంత్రి గారు 22 కోట్లు మంజూరు చేయించారు. అప్పుడు టెండర్లు వేశారు. ప్రభుత్వం మారాక అవిరద్దు చేస్తూ కొత్త జీవో. బై నెంబర్ తో కొత్త జీవో తెచ్చానని ఎమ్మెల్యే మెగా రెడ్డి కూడా త్వరలో పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు చేయకపోవడంతో రాజభవనము ప్రమాదంలో పడింది. కనుక వెంటనే పనులు మొదలుపెట్టి రాజ భవనాన్ని కాపాడి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండవ ర్యాంకు తెచ్చుకున్న పాలిటెక్నిక్ కళాశాల ఈరోజు దినస్థితిలో ఉండి హాస్టల్లు లేక విద్యార్థులు వెనుతిరుగుతున్నా పట్టించుకోని నాధుడు లేక అల్లాడుతుంది. ఈ పరిస్థితికి కారణం పాలకులు అధికారులు అని ప్రజలు ఘంటాపదంగా చెప్తున్నారు.వెనక రాజప్రసాదాన్ని,దాని చరిత్రను రూపుమాపాలనే కుట్రకోణం ఉందని,ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, శివకుమార్, రమేష్, బాలు, గౌనికాడి యాదయ్య, , పాల్గొన్నారు