Home వార్తలు తెలంగాణ తక్కువ మోతాదులో సుక్రోలోజ్‌ వినియోగం సురక్షితం

తక్కువ మోతాదులో సుక్రోలోజ్‌ వినియోగం సురక్షితం

0

తక్కువ మోతాదులో సుక్రోలోజ్‌ వినియోగం సురక్షితం

న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: ది మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎండీఆర్‌ఎఫ్‌), లాభాపేక్షలేని సంస్థ, మధుమేహం, దాని సమస్యలకు సంబంధించి ప్రధాన వైద్య పరిశోధనా సంస్థ, టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్న పెద్దలలో కార్డియో మెటబాలిక్‌ ప్రమాద కారకాలపై సుక్రోలోజ్‌ ప్రభావంపై భారతదేశ మొదటి అధ్యయనాన్ని ఇటీవల ప్రచురించింది. ఆసియా భారతీయులలో కాఫీ/టీలలో టేబుల్‌ షుగర్‌ (సుక్రోజ్‌)ని కృత్రిమ స్వీటెనర్‌ సుక్రలోజ్‌తో భర్తీ చేయడం వల్ల కలిగే ప్రభావాన్ని పరిశీలించడానికి ఇది ఉద్దేశించబడిరది, రాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్‌ టీ2డీ ఉన్న 179 మంది భారతీయులను 12 వారాల పాటు పరీక్షించింది. కాఫీ, టీ వంటి రోజువారీ పానీయాలలో చిన్న పరిమాణంలో సుక్రలోజ్‌ను తీసుకోవడం వలన గ్లూకోజ్‌ లేదా హెచ్‌బీఏ1సీ స్థాయిల వంటి గ్లైసెమిక్‌ మార్కర్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, అధ్యయనం శరీర బరువు, నడుము చుట్టుకొలత, బాడీ మాస్‌ ఇండెక్స్‌లలో కొంచెం మెరుగుదల చూపిస్తుంది. (Story : తక్కువ మోతాదులో సుక్రోలోజ్‌ వినియోగం సురక్షితం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version