ప్రజావాణి లో ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు నాణ్యత పాటించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు నాణ్యత పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూచిస్తూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో ప్రజావాణి కి ఫిర్యాదులు తీసుకొని వస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవసరం అయితే క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యను పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టవద్దని పరిష్కరించలేనివి ఉంటే అట్టి విషయాన్ని సదరు ఫిర్యాదుదారుకు లేఖ ద్వారా తెలియజేయాలని సూచించారు. నేటి ప్రజావాణిలో మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, జడ్పి సి. ఈ ఓ యాదయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి లో ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు నాణ్యత పాటించాలి)