Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ హెల్త్, సీజనల్ కండిషన్స్ పై జిల్లా కలెక్టర్ల సమావేశం 

హెల్త్, సీజనల్ కండిషన్స్ పై జిల్లా కలెక్టర్ల సమావేశం 

0

హెల్త్, సీజనల్ కండిషన్స్ పై జిల్లా కలెక్టర్ల సమావేశం 

న్యూస్‌తెలుగు/అమరావతి : ఎం. కృష్ణబాబు, ఐఏఎస్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిస్థితి గురించి వివరించారు. మెటర్నల్ మోర్టాలిటీ రేషియో, డెలివరీలు, జననాల వివరాలు వెల్లడించారు. జిల్లాల్లో ఎంసీహెచ్ సర్వీసులు, కమ్యునికేబుల్ డిసీజెస్ అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 2027 నాటికి టీబీ నోటిఫికేషన్ 100 శాతం, 2027 నాటికి ఫైలేరియా జీరో కేసులు, 2027 నాటికి లెప్రసీ జీరో కేసులు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచామని, 13వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఎన్సీడీ మేనేజ్ మెంట్, కార్డియాక్ కేర్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి వెల్లడించారు.

జిల్లాల్లో ట్రైబల్ హెల్త్, మెంటల్ హెల్త్, క్వాలిటీ కాంప్లియన్స్ అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 14416 నంబరుతో టెలి మానస్ కాల్ సెంటర్ పెట్టామన్నారు. డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్‌క్యూఎస్ సర్టిఫికేషన్ లో 760 ఫెసిలిటీస్ సర్టిఫై చేయించాం. దేశంలో ఇది అత్యధిక నెంబర్, 2025-26 ఏడాది నాటికి వంద శాతం సెంటర్లను ఎన్‌క్యూఎస్ సర్టిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో సిబ్బంది హాజరు శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఆగష్టు 20న డీవార్మింగ్ డే నిర్వహించాలి. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేయాలన్నారు.

చంద్రన్న సంచార రథం కార్యక్రమం ద్వారా పీహెచ్‌సీ వైద్యులను గృహా వైద్యసేవలకు పంపిస్తున్నామని, దీనికి ముందు ట్రేస్ చేసిన పిల్లలను పరిశీలించడం, వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఆగష్టు 15 నుంచి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1.56 కోట్ల పీఎం జేఏవై ఆయుష్మాన్ భారత్ కార్డులను ఎన్ రోల్ చేయడం జరిగిందన్నారు. 38 లక్షల మందిని ఎన్ రోల్ చేయాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలో 4.3 కోట్ల మందికి అర్హత ఉందని, వీరిలో 1.94 కోట్ల మందికి పీఎం జేఏవైలో అర్హత ఉందని వెల్లడించారు. (Story : హెల్త్, సీజనల్ కండిషన్స్ పై జిల్లా కలెక్టర్ల సమావేశం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version