ఎమ్మెల్యే ఏలూరి చొరవ…8 దశాబ్దాల రైతన్నల కల సాకారం
•ఇనాం భూముల సమస్యకు పరిష్కారం
•రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
•చరిత్రలో నిలిచేలా అన్నదాతలకు అండగా ఏలూరి
•సీఎం చంద్రబాబు,మంత్రి అనగానికి లేఖ రాసిన ఎమ్మెల్యే ఏలూరి
•స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
•గ్రామాల్లో పర్యటించిన జేసీ సుబ్బారావు
•రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్న అధికారులు
•సమస్యను త్వరలో పరిష్కరిస్తాం …జేసీ
•హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఎమ్మెల్యే ఏలూరికి ప్రత్యేక కృతజ్ఞతలు
న్యూస్‌తెలుగు/వేటపాలెం : పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చొరవతో నియోజకవర్గంలో 8 దశాబ్దాలుగా నోచుకోని ఇనాం భూముల సమస్యకు పరిష్కారం లభించింది. పర్చూరు నియోజకవర్గంలోని సుమారు 2500 ఎకరాల ఇనాం ఎస్టేట్ భూముల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఏలూరి చూపిన చొరవతో రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే ఏలూరి కృషితో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు మండలం ఏదుబాడు, చెన్నుంబొట్లవారిపాలెం, మార్టూరు మండలంలోని లక్కవరం, జంగమహేశ్వపురం గ్రామాలలో రైతులు గత 80 సంవత్సరాలుగా ఈనాం ఎస్టేట్ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న ఇనాం భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర యాజమాన్య హక్కు పత్రాలు కానీ లేకపోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పరంగా అందించే ఎటువంటి సంక్షేమ పథకాలు, సబ్సిడి పధకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు లలో వ్యవసాయానికి అవసరమైన రుణాలు మంజూరు కాక పెట్టుబడులకు సరైన సమయంలో నగదు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొవలసి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరి సమస్యను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెవిన్య మంత్రి అనగాని సత్యప్రసాద్ ల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని 80 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని వేలాది మంది రైతులకు ప్రయోజనం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.
ఏలూరు వినతితో స్పందించిన ప్రభుత్వం
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాదులు స్పందించారు.వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వెంకట మురళి,జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావులను చర్యలు తీసుకునేలా ఆదేశించింది. వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు ఆయా గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాల తాసిల్దార్లతో రైతుల సమక్షంలో పైళ్లను పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించి రైతులకు హక్కుదారు పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏళ్ల నాటి సమస్యకు… చరిత్రలో నిలిచేలా ఏలూరి పరిష్కారం…
ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఇనాం, ఎస్టేట్ భూముల సమస్యను అధికారంలోకి వచ్చినకూటమి ప్రభుత్వం నెలల కాలంలోనే పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే ఎవరు ప్రత్యేక కృషి చేశారు. స్వాతంత్ర్య పాలనలో పరిష్కారం కానీ ఈ సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే ఏలూరి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఏలూరి వస్తున్న కృషి అమోఘం అంటూ కితాబిస్తున్నారు.
5010 ఎకరాలు,2057 మంది రైతులు కల సాకారం
పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు మార్టూరు మండలాల పరిధిలోని ఏదుబాడు, చెన్నుంబొట్లవారిపాలెం, లక్కవరం, జంగమహేశ్వపురం గ్రామాలలో సుమారు 5010ఎకరాలు ,2057 మంది రైతుల కల సాకారం కానుంది. చెన్నుంబొట్లవారిపాలెం 802.71 ఎకరాలు 320 రైతులు, ఎదుబాడు లో ఎస్టేట్ భూములు 1104.32 ఎకరాలు 430 మంది రైతులు ,లక్కవరం 565.ఎకరాలు, 386 మంది రైతులు,జంగమహేశ్వపురం2539 ఎకరాలు 912 మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఈనాం ఎస్టేట్ భూముల సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ అలాంటి ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యే ఏలూరి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి మంత్రులతో తనకున్న సాన్నిహిత్యంతో సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే వేలూరు చేసిన కృషికి ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చింది రైతన్నలకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం…
ఎమ్మెల్యే ఏలూరి కృషి ఫలితంగా తమ దశాబ్దాల కల సహకారం అవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరికి రుణపడి ఉంటామని ఆయన చేసిన మేలు మరువలేమన్నారు. ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది నాయకులు మారిన తమ సమస్య పరిష్కారానికి నోచుకోలేని ఎమ్మెల్యే ఏలూరి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతు రైతు శ్రేయస్సు కోసం కృషి చేసి రైతులకు అండగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మేము అడగకపోయినా సమస్యను పరిష్కరించేందుకు చూపిన చొరవకు ఫిదా అవుతున్నామని రైతుల పేర్కొన్నారు.
నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తా.. జేసీ సుబ్బారావు
పర్చూరు నియోజకవర్గంలోని ఈనామ్ ఎస్టేట్ భూముల సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని జేసీ సుబ్బారావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుని ఎంక్వయిరీ నిర్వహించినట్టు తెలిపారు. నెల రోజుల్లో రైతులందరికీ పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.