స్వర్గీయ జయరాములు అతిధి గృహాన్ని పునరుద్ధరించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కీర్తిశేషులు స్వర్గీయ జయరాములు గారి అతిధి గృహాన్ని పునరుద్ధరించాలని లేనియెడల ఆగస్టు రెండో వారంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని. పంచాయతీరాజ్ ఎస్. ఈకి , కలెక్టర్ కి అఖిలపక్ష ఐక్యవేదిక వినతి పత్రం ఇచ్చారు. ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, వనపర్తి తాలూకాగా ఉన్నప్పుడు స్వర్గీయ కీర్తిశేషులు జయరాములు గారి స్మరకార్థం నిర్మించిన పంచాయతీ రాజ్ అతిథి గృహాన్ని వనపర్తి జిల్లా అయిన తర్వాత ఆఫీసుల కొరతతో కలెక్టర్ గారి నివాస భవనాన్ని కి కేటాయించడం జరిగింది. అప్పటి ప్రజాప్రతినిధులు కలెక్టర్ బంగ్లా కట్టిన తర్వాత మళ్లీ అతి గృహానికి కేటాయించడం జరుగుతుందని చెప్పడంతో ప్రజలు ఓకే చెప్పారు. కానీ కలెక్టర్ గారు ఇక్కడి నుండి ఖాళీ చేసిన వెంటనే అతిధి గృహానికి కేటాయించకుండా పంచాయతీరాజ్ ఎస్. ఈ ఆఫీసుగా దీన్ని మార్చడం జరిగింది. ఒక బీసీ ఎమ్మెల్యే పేరు మీద కట్టిన ఈ భవనాన్ని ఆయన పేరు మీదనే ఉంచకుండా కుట్రతో ఆయన పేరును చేరిపివేశారని దీనిపై పలు సార్లు ఐక్యవేదిక అక్షేపించిందని తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన జయ రాములు అతిథి గృహాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని దానికి కారణం అందరూ అగ్రవర్ణాల నాయకులే ఉండడం వల్ల వారికి కొందరు భజన చేస్తూ పాట పాడుతూ చరిత్రను రూపు మార్చాలని చూస్తున్నారని, ప్రజలు వ్యక్తుల పై కోపం ఉండదని , వ్యవస్థలో చేసే అవినీతి అక్రమాలపైనే కోపం ఉంటుందని కనుక ప్రజల ఆగ్రహానికి గురికాకూడదని, పరోక్షంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగోళ్ల శంకర్, నాయకులు గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, రాములు, రమేష్ పాల్గొన్నారు. (Story : స్వర్గీయ జయరాములు అతిధి గృహాన్ని పునరుద్ధరించాలి)