ఎమ్యెల్యే తన మాటలు ఉపసంహరించుకోవాలి సిపిఎం డిమాండ్
న్యూస్తెలుగు/ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : అసెంబ్లీ వేదికగా సిర్పూర్ ఎంఎల్ఏ డా” హరీష్ బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం సమస్యలు పరిస్కరించక పోతే మహారాష్ట్ర కలుపాలనడం సరికాదు. పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ నగేష్ గెలిపిస్తే జోడెడ్లలాగా పనిచేసి నియోజక వర్గ అభివృద్ధికి రోజుకు 100 కోట్ల చొప్పున 1825 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి, అసెంబ్లీలో మాట్లాడుతూ మహారాష్ట్రలో కలుపాలనడం విడ్డూరంగా ఉందని.నిధుల సాదనకు ప్రతిపక్ష ఎంఎల్ఏ లు అసెంబ్లీ వేదికగా పోరాడాలి, అవసరమైతే అసెంబ్లీ లో నిరసన తెలుపాలి, నిరాహారదీక్ష చేయాలి కానీ మరో రాష్ట్రం లో కలుపాలనడం సరికాదు. కావున తన మాటలు వెంటనే ఉపసంహరించు కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న డిమాండ్ చేశారు. (Story : ఎమ్యెల్యే తన మాటలు ఉపసంహరించుకోవాలి- సిపిఎం డిమాండ్)