ఏ బి సి డి వర్గీకరణ పై తీర్పు. మాదిగల సంబరాలు
సీఎం రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం
న్యూస్‌తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఎస్సీల ఏబిసిడి ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చింతలమానేపల్లి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రాయ్ విగ్రహం వద్ద
ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గోగర్ల పోచయ్య ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణ సంచులతో గురువారం సంబరాలు జరుపుకున్నారు .ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గోగుర్ల పోచయ్య మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి ఎంతగానో పోరాడి అసువులు బాషారన్నారు.సుదీర్ఘ పోరాటంలో నేడు వారి పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం పై హర్షం వ్యక్తం చేశారు.దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం శుభ సూచకమని పేర్కొన్నారు. అందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో తోపాటు పార్లమెంట్లో కూడా దీని బిల్లుపై ఆమోదించి వర్గీకరణ చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు నందిపేట రామయ్య, నాయకులు ఇప్ప శ్రీనివాస్ , ఇప్ప శంకర్, గోలేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఏ బి సి డి వర్గీకరణ పై తీర్పు. మాదిగల సంబరాలు)